Mahesh Babu: “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో మెడ మీద టాటూ వేయించుకోవడం… మాత్రమే కాకుండా తీ సినిమా తరహాలో గుబురు జుట్టుతో కనిపిస్తూ ఉండటంతో సినిమా స్టోరీ ఏంటి అన్నదానిపై సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా బ్యాంకు రాబరీ తరహాలో తెరకెక్కుతున్న ట్లు… సెటిల్మెంట్లు చేసే వ్యక్తిగా మహేష్ క్యారెక్టర్ ఉండబోతున్నట్లు మొదటి లో వార్తలు వచ్చిన తర్వాత సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో మహేష్ నటిస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఫస్ట్ టైం మహేష్ సరసన నటిస్తున్న మహానటి ఫేమ్ కీర్తి సురేష్.. క్యారెక్టర్ సినిమాకి హైలైట్ అని సరికొత్త వార్త ఇటీవల ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. విషయంలోకి వెళితే మహేష్ కి జూనియర్ ఎంప్లాయ్ పాత్రలో… కీర్తి సురేష్ క్యారెక్టర్ ఉంటుందని ఇద్దరి మధ్య కామెడీ నేపథ్యంలో సన్నివేశాలు… సినిమాకే హైలెట్ అయ్యేలా… పరశురామ్ చిత్రీకరించినట్లు సమాచారం. కీర్తి సురేష్ ని బాగా ఆటపట్టించే రీతిలో మహేష్ నటన ఉండబోతుందట.
అదేవిధంగా ఇంటర్వెల్ ఆ టైంలో కీర్తి సురేష్ క్యారెక్టర్ ట్విస్ట్ ఇచ్చే రీతిలో సినిమా మొత్తాన్ని మార్చటం జరుగుతుందట. ఇదిలా ఉంటే మే 31 వ తారీకు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన పోస్టర్ .. మహేష్ బాబు పూర్తి లుక్ ఒకటి రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందట. దీంతో మహేష్ ఫుల్ గెటప్ ఎలా ఉంటుందో అని… ఆడియన్స్ తో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.