బాలీవుడ్ ఎంట్రీ…


నేను శైల‌జ సినిమాతో తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన కీర్తిసురేష్‌కు మ‌హాన‌టి చాలా పెద్ద గుర్తింపు సంపాదించి పెట్టింది. అలాగే గ‌త ఏడాది కీర్తికి బాగా క‌లిసి వ‌చ్చింద‌నే చెప్పాలి. 2018లో మ‌హాన‌టి, గ్యాంగ్‌, సామి స్క్వేర్‌, స‌ర్కార్‌, పందెంకోడి2 చిత్రాల్లో న‌టించి ఆకట్టుకుంది. ఈ ఏడాది సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా ఎ.ఆర్.ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో న‌టించ‌నుంది. ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించాల‌నే క‌ల తీర‌డం ప‌ట్ల హ్యాపీగా ఉన్న కీర్తిసురేష్‌కు, ఆమె అభిమానుల‌కు మ‌రో హ్యాపీ న్యూస్ . అదేంటంటే.. ఆ ఏడాది కీర్తిసురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. వివ‌రాల్లోకెళ్తే శ్రీదేవి భ‌ర్త‌, బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ నిర్మించ‌బోయే హిందీ సినిమాలో కీర్తి సురేష్ న‌టించడానికి ఓకే అన్నారు. `బ‌దాయి హో` సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అమిత్ శ‌ర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం బోనీక‌పూర్ హిందీ చిత్రం పింక్‌ను త‌మిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.