NewsOrbit
Entertainment News సినిమా

Keerthy Suresh: భోజనంలో అది లేకపోతే ముద్ద దిగదు కీర్తి సురేష్ వైరల్ కామెంట్స్..!!

Share

Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేష్ అందరికి సుపరిచితురాలే. 2000 సంవత్సరంలో బాలనాటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమా రంగంలో తెలుగు, తమిళ్, మలయాళ రంగంలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోయిన్. అంతకుముందు ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. 2013వ సంవత్సరంలో మలయాళంలో “గీతాంజలి”తో హీరోయిన్ గా కీర్తి సురేష్ వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత తమిళ్ మరియు తెలుగు చిత్రాలలో అవకాశాలు అందుకుని వరుస పెట్టి విజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. 2018లో విడుదలైన “మహానటి” సినిమాతో జాతీయ అవార్డు అందుకోవటం జరిగింది.

Keerthy Suresh's Viral Comments about his lunch

దివంగత అందాల నటి సావిత్రి సినిమా బయోపిక్ ఆధారంగా తరలించిన ఈ సినిమాలో టైటిల్ పోషించిన కీర్తి సురేష్… పాత్రలో ఒదిగిపోయారు. విమర్శకుల ప్రశంసలు అందుకోవటం జరిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో… ప్రతి సన్నివేశంలో.. సావిత్రిని గుర్తు చేశారు. 66వ జాతీయ భారతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు చలనచిత్రంగా అదేవిధంగా ఉత్తమ తెలుగు నటిగా కీర్తి సురేష్ అవార్డు అందుకోవటం జరిగింది. కాగా రీసెంట్ గా కీర్తి సురేష్ నటించిన దసరా బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తన ఆహారపు అలవాట్లు గురించి మాట్లాడుతూ… కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది. ఉదయం లేవగానే ఒక గ్లాసు పాలలో తేనె కలుపుకొని తాగేస్తా. ఆ తర్వాత రోజంతా నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకుంటా. నాన్‌వెజ్‌ అంటే ఇష్టం. కాకపోతే గ్లామర్‌ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి ఎక్కువగా వెజ్‌ డైట్‌ ఫాలో అవుతుంటా. భోజనంలో చారు ఉండాల్సిందే.

Keerthy Suresh's Viral Comments about his lunch

చివరి ముద్ద చారన్నం తింటేనే భోజనం పూర్తయినట్టు. చారులేనిదే ముద్ద దిగదు. ఖచ్చితంగా యోగ మరియు వర్కౌట్ చేస్తా. అదే నా బ్యూటీ సీక్రెట్. ఐస్ క్యూబ్స్ తో మర్దన చేస్తాను. అంతకుమించి జాగ్రత్తలు పెద్దగా ఏమి తీసుకోను. మహానటి తర్వాత “దసరా” వెళ్ళిన చాలా చాలెంజింగ్ రోల్. కచ్చితంగా ప్రేక్షకులు వెన్నెల పాత్ర ఆదరిస్తారని చేశాను. పాత్రకు తగ్గట్టు తెలంగాణ యాస భాగా ప్రాక్టీస్ చేశాను. షూటింగ్ టైంలో ఒక ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెల్ప్ చేయటంతో డబ్బింగ్ చెప్పే టైం కి మొత్తం వచ్చేసింది అంటూ కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇంకా స్విమ్మింగ్ అంటే ఇష్టం అని చిన్నప్పుడు ఇంట్లో చెప్పకుండానే వెళ్ళిపోయి ఈత కొట్టడం జరిగిందని పేర్కొంది. జంతువులు పక్షులు అంటే ఇష్టం. జంతు హింసకు వ్యతిరేకంగా పనిచేసే పెటా లాంటి సంస్థలకు నా మద్దతు ఉంటుంది.. అంటూ తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ అనేక విషయాలు తెలియజేశారు.


Share

Related posts

Pawan Kalyan: డిఫరెంట్ లుక్ లో పవన్ కళ్యాణ్..??

sekhar

Chiranjeevi : ‘నెపోటిజమ్’ కి అడ్డుగోడలా.. టాలీవుడ్ కి అండ‌గా నిలబడ్డ చిరంజీవి..!

arun kanna

Saranga Dariya : యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో లవ్ స్టోరీ సారంగ దరియా సాంగ్

Varun G