Ram Charan: “RRR” కీ ఆస్కార్ అవార్డు రావాలని భారతీయ చలనచిత్ర రంగం యొక్క ప్రముఖులు ఎంతగానో కోరుకుంటున్నారు. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని ఊహించని విధంగా పెంచేసింది. ప్రపంచ సినిమా రంగంలో టాప్ మోస్ట్ దర్శకులు… రాజమౌళి పనితనాన్ని కొనియాడుతున్నారు. అవతార్ వంటి సినిమాలు తీసిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళితో పనిచేయడానికి రెడీగా ఉన్నట్లు ఓపెన్ గానే మీడియా ముందు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
అనేక అంతర్జాతీయ అవార్డుల సొంతం చేసుకున్న “RRR”.. ప్రపంచ సినిమా రంగంలో అత్యుత్తమ అవార్డు ఆస్కార్ గెలవాలని చాలామంది కోరుకుంటున్నారు. ఈనెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎవరికి వారు ఇంటర్వ్యూలు ఇస్తూ.. సరికొత్త విషయాలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా పరంగా రామ్ చరణ్ కీ విదేశాలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అమెరికాలో పలు పేరు గాంచిన షోలలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా గురించి ఇంకా తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అవకాశాలు వస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలో.. పూర్తి విషయాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. “టాక్ ఈజీ పాడ్ కాస్ట్” లో ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. చరణ్ చేసిన తాజా వ్యాఖ్యలు మెగా అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇదిలా ఉంటే ఈ నెల 27 రామ్ చరణ్ బర్త్ డే నేపధ్యంలో శంకర్ సినిమాకీ సంబందించీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో కూడిన టైటిల్ ప్రకటించనున్నారట.