Balakrishna: బాలకృష్ణ తోటి హీరోలు నాగార్జున, చిరంజీవి మరి కొంతమంది హీరోల కొడుకులు ఇప్పటికే ఎంట్రీలు ఇవ్వడం తెలిసిందే. సీనియర్ హీరోల కుమారులు వారసునిగా రంగంలోకి దిగి.. దాదాపు చాలామంది పది సినిమాలకు పైగా చేస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అన్నదాని గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. నందమూరి ఫ్యాన్స్ గత కొంత కాలం నుండి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సిని ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను మోక్షజ్ఞ మరీ లావుగా కనిపించడంతో.. అభిమానులు చాలా నిరుత్సాహం చెందారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉండదని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఖచ్చితంగా మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నట్లు.. గత ఏడాది అది తన పుట్టిన రోజు వేడుకల సమయంలో బాలయ్య ఇంటర్వ్యూలలో తెలిపారు. దీంతో మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే దాని విషయంలో చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, వీవీ వినాయక్… అలాగే అనిల్ రావిపూడి. ఇదిలా ఉంటె ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి.. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.
ఈ వార్త తన దాకా వచ్చిందని పేర్కొన్నారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి దర్శకత్వం చేస్తున్నట్లు వస్తున్న వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని అనిల్ రావిపూడి తెలిపారు. బాలయ్య బాబు తనతో ఈ విషయం ఎప్పుడూ కూడా చర్చించలేదని పేర్కొన్నారు. ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను అని స్పష్టం చేశారు. ఇప్పుడు ఫోకస్ మొత్తం బాలయ్య బాబుతో చేయబోయే సినిమా పైనే ఉందని అనిల్ రావిపూడి తెలిపారు. కేవలం ఆరు నెలలోనే బాలయ్య బాబు సినిమా కంప్లీట్ చేయడం జరుగుతుందని.. చెప్పుకొచ్చారు. అయితే ఇంటర్వ్యూలో “ఎఫ్ త్రీ” విజయం సాధించడంతో..F4 కూడా రాబోతుందని..కానీ కొంచెం టైం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు.