ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సత్తా చాటిన సినిమాలలో “కేజీఎఫ్ 2” ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ చలనచిత్ర రంగంలో 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. “కేజీఎఫ్ ” మొదటి భాగం సూపర్ సూపర్ హిట్ కావడంతో “కేజీఎఫ్ 2” పై జనాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రేక్షకులు పెట్టుకున అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ “కేజీఎఫ్ 2” తెరకెక్కించడం జరిగింది. దీంతో ఏప్రిల్ 14 వ తారీకు సినిమా విడుదల అవ్వక మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని.. తిరుగులేని కలెక్షన్స్ సాధించింది.
ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 500 కోట్లకు పైగానే ఒక డబ్ సినిమా కలెక్షన్ సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. హీరో యాష్ నీ హైవోల్టేజ్ తరహాలో చూపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసిన “కేజీఎఫ్ 2″… నిన్న మొన్నటి వరకు ఓటీటీ లలో కూడా నాకు ట్రెండింగ్ లో ఉంటూ రికార్డు సాధించడం జరిగింది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి ఓర్ మ్యాక్స్ పవర్ రేటింగ్స్ లో ఈ సినిమా దిమ్మతిరిగే రేటింగ్‌ను సాధిచింది. 90+ రేటింగ్‌తో నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ రేటింగ్‌కు రీచైన మొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే “KGF 2” చివరి భాగంలో “KGF 3” కి సంబంధించి హింట్ ఇవ్వటం తెలిసిందే. దీంతో “KGF 3” సినిమాకి సంబంధించి ఎప్పుడు అప్డేట్ వస్తుందో అని సినీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. మరోపక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఖచ్చితంగా మూడో భాగం ఉంటుంది కానీ ఇంకా టైం పట్టే అవకాశం ఉందని.. పలు ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది.