KGF 2: ఇప్పుడు దేశవ్యాప్తంగా “కేజిఎఫ్ 2” మానియా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు “ఆర్ఆర్ఆర్” రీ సౌండ్ గట్టిగా వినబడింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” మార్చి 25 వ తారీకు విడుదల అయ్యి… భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. “ఆర్ఆర్ఆర్” ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిలీజ్ అయి అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ విజయం సాధించి… రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజిఎఫ్ 2” కూడా అదే రేంజ్ లో విజయం సాధించడం .. సంచలనంగా మారింది.“కేజిఎఫ్” మొదటి చాప్టర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో….”కేజిఎఫ్ 2″ అదే రేంజ్ లో ఉండటంతో పాటు హీరో యాష్ … మరింత స్ట్రాంగ్ గా… మరోసారి తన సత్తా చాటడంతో థియేటర్ లు దద్దరిల్లుతున్నయి. కన్నడ ఇండస్ట్రీలో మాదిరిగానే మిగతా చోట్ల కూడా..”కేజిఎఫ్ 2″ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో కేరళలో “కేజిఎఫ్ 2”..7.5గ్రాస్ కలెక్షన్లు సాధించడం సంచలనంగా మారింది. ఒక కేరళలో మాత్రమే కాదు హిందీలో కూడా విడుదలైన మొదటి రోజు రికార్డ్ స్థాయి వసూళ్లు రాబటడం జరిగిందట. ఓపెనింగ్ రోజే హిందీలో 53.95 ₹కోట్లు కలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా “కేజిఎఫ్ 2” సునామి కలెక్షన్లు సాధిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. అంబేద్కర్ జయంతి అదేవిధంగా గుడ్ ఫ్రైడే..తో పాటుగా వీకెండ్ రావడంతో.. మొదటి వారంలోనే “కేజిఎఫ్ 2” ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. పైగా మొదటి భాగం రెండో భాగం… మరింత హైలైట్.. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులు సినిమా ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!