సినిమా

KGF 2: `కేజీఎఫ్ 2` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌..ఇంకా ఎంత బ్యాలెన్స్ అంటే?

Share

KGF 2: `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`తో దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ మ‌రియు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌లు.. ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా `కేజీఎఫ్ 2` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేశారు. హోంబలి ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది.

అలాగే సంజయ్ దత్ విల‌న్‌గా చేయ‌గా.. రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేశ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనేక అడ్డంకుల‌ను దాటుకుని.. చివ‌రాఖ‌ర‌కు ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల అయింది. ఇందులో భారీ క‌థ ఏమీ లేక‌పోయినా.. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, హీరో ఎలివేష‌న్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు ఆక‌ట్టుకున్నాయి.

రాకీభాయ్ గా య‌శ్ త‌న‌దైన న‌ట‌న‌తో విశ్వ‌రూపం చూపించాడు. మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్‌ చెబుతూ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిపడేశాడు. మొత్తానికి తొలిరోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ అనేక రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఫ‌స్ట్ వీకెండ్ పూర్తి అయ్యే స‌రికి ఈ చిత్రం రూ.53.56 షేర్ వ‌సూల్ చేసి వీరు కుమ్ముడు కుమ్మింది. ఇక మ‌రి ఏరియాల వారీగా ఫ‌స్ట్ వీకెండ్‌ కేజీఎఫ్ 2 టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ప‌రిశీలిస్తే..

నైజాం: రూ. 28.17 కోట్లు
సీడెడ్: రూ. 7.44 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: రూ. 4.82 కోట్లు
తూర్పు: రూ. 3.56 కోట్లు
పశ్చిమ: రూ. 2.17 కోట్లు
గుంటూరు: రూ. 2.98 కోట్లు
కృష్ణ: రూ. 2.66 కోట్లు
నెల్లూరు: రూ. 1.76 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ టోట‌ల్‌= రూ. 53.56 కోట్లు (రూ. 84.80 కోట్లు~ గ్రాస్)
——————————

కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈ సినిమా ఇక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ అవ్వాలంటే ఫ‌స్ట్ వీకెండ్ వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా రూ. 25.44 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది. మ‌రి బ్యాలెన్స్ షేర్‌ను య‌శ్ ఎంత త్వ‌ర‌గా వ‌సూల్ చేస్తాడో చూడాలి.


Share

Related posts

సినిమా జాతర షురూ..! మహేశ్ ధియేటర్లో బొమ్మ పడుతోంది..

Muraliak

నాని V సినిమా పై పిచ్చ కోపంతో ఉన్న మహేష్ బాబు ఫాన్స్ ??

GRK

Alluarjun Pushpa dance video : పుష్ప సినిమా పాట లీక్..! అల్లు అర్జున్ డాన్స్ అదుర్స్..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar