KGF 2: ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అందరూ ఎదురు చూసిన మరో భారీ పాన్ ఇండియన్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2. 2019లో వచ్చి అనూహ్యమైన విజయాన్ని అందుకొని సౌత్ అండ్ నార్త్‌లో భారీ వసూళ్ళు రాబట్టిన కేజీఎఫ్ 1కి సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్స్ సీన్స్, యష్ రాకింగ్ పర్ఫార్మెన్స్ సినిమాపై ఈ రేంజ్ క్రేజ్ నేలకొనడానికి ప్రధాన కారణాలు. అందుకు తగ్గట్టే సీక్వెల్ సినిమా నుంచి వచ్చిన ప్రతీది అంచనాలు అంతకంతా పెంచుతూ వచ్చాయి.
గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన కేజీఎఫ్ 2 ఎట్టకేలకు ఈ రోజు అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయింది. నిన్ననే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో కాస్త కేజీఎఫ్ 2 మీద కూడా సందేహాలు కలిగాయి. కానీ, అలా జరగలేదు. ముందు నుంచి అందరూ అనుకున్నట్టుగా కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడించేస్తుంది. పార్ట్ 1 కంటే రెట్టింపు స్థాయిలో ప్రశాంత్ నీల్ తీసిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి.
KGF 2: ఆర్ఆర్ఆర్ దగ్గర్లో కేజీఎఫ్ 2 వసూళ్ళు..!
మేకింగ్ పరంగా ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేదని సినీ ప్రేమికులు తమ రివ్యూను చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. యాక్షన్ సీన్స్‌కు బీజీఎం అద్భుతంగా కుదిరిందని చెప్పుకుంటున్నారు. మొదటి రోజు హిట్ టాక్ తెచ్చుకోవడంతో గ్యారెంటీగా ఆర్ఆర్ఆర్ రేంజ్‌కు దగ్గర్లో కేజీఎఫ్ 2 వసూళ్ళు ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి భారీ మాసీవ్ హిట్ అంటున్న ఈ సినిమా లాంగ్ రన్లో వసూళ్ళ పరంగా ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!