సినిమా

KGF: కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న KGF 2.. అతి తక్కువ రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా రికార్డ్!

Share

KGF: కరోనా కష్టకాలం తర్వాత వరుసగా రెండు సౌత్ సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఇపుడు సంచలనంగా మారింది. ఆర్.ఆర్.ఆర్ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి దర్శకధీరుడు రాజమౌళి కారణమైతే, ఇప్పుడు కేజీఎఫ్ 2 చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ కారకుడు. కేజీఎఫ్ 2 చిత్రాన్ని అతడు తెరకెక్కించిన విధానం ఇపుడు బి టౌన్ లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మేకింగ్ లో యూనిక్ థాట్స్, హీరోయిజం ఎలివేషన్.. గురించి దేశం అంతా మాట్లాడుకొనేలా చేసాడు. ఆస్కార్ విన్నర్ 300 సహా ఎన్నో హాలీవుడ్ సినిమాల తీరుగా కేజీఎఫ్ 2 కూడా సాంకేతికంగా ది బెస్ట్ గా కనిపించడం కొసమెరుపు.

KGF 2 is creating a tsunami of collections.
KGF 2 is creating a tsunami of collections.

KGF: ఇంత జరిగినా ఏమి ఎరగనట్టే వున్నాడు!

ఇక కేజీఎఫ్ ఇంత గొప్పగా ఆడుతుంటే ఏమి ఎరగనట్టే వున్నాడు మన ప్రశాంత్ నీల్. అతడు సక్సెస్ మీట్ల పేరుతో అనవసర హంగామా చేయకుండా చాలా కూల్ గా వున్నాడు. సినిమా గొప్పగా ఆడుతుంటే ఇంకా ఇంకా హంగామా సృష్టించాలని భావించే రొటీన్ మేకర్స్ కి అతడు డిఫరెంట్ అని అర్ధం అయింది. దాంతో ప్రశాంత్ ని కొందరు సినిమా ఉద్ధండులు ఆకాశానికెత్తేస్తున్నారు. KGF2 ఇక్కడేకాదు విదేశాల్లో కూడా తన ఉనికిని చాటుకుంటోంది. ఎట్టకేలకు అతడు తన హీరో నిర్మాతతో కలిసి తాజాగా కేక్ కట్ చేశారు. హీరో యష్ – హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్ లతో కలిసి ప్రశాంత్ నీల్ సక్సెస్ వేడుకలో కనిపించారు.

KGF 2 is creating a tsunami of collections.
KGF 2 is creating a tsunami of collections.

బాలీవుడ్ ని కొల్లగొడుతున్న సౌత్ సినిమాలు

ఇకపోతే మన సినిమాలు బాహుబలి 1,2 తరువాత పుష్ప, RRR, దానితరువాత KGF చిత్రాలు బాలీవుడ్లో
దుమ్ముదులిపే కలెక్షన్లు కురుపిస్తున్నాయి. దాంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు ఖంగు తింటున్నారు. అవును.. ఒకప్పుడు మన సినిమాలను ప్రాంతీయ భాష చిత్రాలుగా చిన్న చూపే వీరు ఇపుడు ఆలోచనలో పడ్డారు. 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రాలు దాదాపు 3, 4 వందలు దాకా నార్త్ లోనే కొల్లగొడుతున్నాయి. అందుకే ఇపుడు బి టౌన్ ఆలోచనలో పడింది.


Share

Related posts

Acharya: మెగాస్టార్ ‘ఆచార్య’ బ్యాలెన్స్ షూటింగ్ అప్ డేట్..!!

bharani jella

స్టైలిష్ లుక్ లో రచ్చ లేపుతున్న ప్రభాస్

sowmya

టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం… బయటపడే పేర్లన్నీ స్టార్లవే?

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar