KGF 2 Beast: ప్రస్తుతం దేశవ్యాప్తంగా “కేజిఎఫ్ 2” పేరు మారుమ్రోగుతోంది. నిన్న మొన్నటి వరకు “ఆర్ఆర్ఆర్” పేరు వినిపించగా ఇప్పుడు రాఖీ బాయ్ దెబ్బకి.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ లు షేక్ అయిపోతున్నాయి. మొన్నటిదాకా రాజమౌళి.. బాక్సాఫీస్ లపై దండయాత్ర చేయగా ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టైం వచ్చిందని.. మొత్తానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని సౌత్ దర్శకులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. RRR, KGF 2… సినిమాలకు భారీ కలెక్షన్లు రికార్డు స్థాయిలో రావడంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం.. అక్కడి స్టార్ హీరోలకు దీటుగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ దక్కించుకుంటున్న క్రమంలో… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక టైంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే… భాలీవుడ్ గురించి మాట్లాడుకునే వాళ్లు.. కానీ ఇప్పుడు రాజమౌళి అదేవిధంగా ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇద్దరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు.. బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. పాటు రికార్డు స్థాయి కలెక్షన్స్ రావడంతో… రాజమౌళి.. ప్రశాంత్ నీల్ హవా కొనసాగుతోందని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే కేజీఎఫ్ 2 విడుదలకు ఒక రోజు ముందు తమిళ ఇండస్ట్రీలో దళపతి విజయ్ నటించిన బీస్ట్ విడుదల కావటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన బీస్ట్.. బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. సినిమా పరాజయం కావడంతో కొన్ని చోట్ల స్క్రీన్ లు కూడా విజయ అభిమానులు కాల్చేయడం జరిగింది. ఇదిలా ఉంటే బీస్ట్.. కేజిఎఫ్ 2 సినిమాలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ బిజినెస్ లో నువ్వానేనా అన్నట్టుగా.. టాఫ్ ఫైట్ నెలకొన్నట్లు మొన్న వార్తలు రావడం తెలిసిందే. అయితే ప్రజెంట్ “కేజిఎఫ్ 2″… తిరుగులేని విజయం సాధించడంతో రాఖీ బాయ్ దెబ్బకి.. దళపతి విజయ్ బీస్ట్ దివాళా తీసేసినట్లు … కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. “కేజిఎఫ్ 2″… సూపర్ డూపర్ హిట్ కావడంతో విజయ్ అభిమానులు.. తల బాదుకుంటున్నట్లు…”కేజిఎఫ్ 2″… వల్ల బెస్ట్ సినిమా ఎక్కడ తీసేస్తా రేమో అన్న టెన్షన్ తో ఉన్నట్లు తమిళ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరో అయినా గాని యాష్.. రాఖీ బాయ్ క్యారెక్టర్ లో… దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు నచ్చడం మాత్రమే కాదు.. మాస్ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోకి కేరాఫ్ అడ్రస్ గా మారి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.