NewsOrbit
సినిమా

KGF 2:`దంగల్` ను దాటేసిన `కేజీఎఫ్ 2`.. బాలీవుడ్‌కు వ‌ణుకు మొద‌లైందా?

KGF 2: క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ హీరోగా ప్రముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. 2018లో సైలెంట్‌గా విడుద‌లై దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన‌ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`కు కొన‌సాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. హోంబలి ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విల‌న్ పాత్ర‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం.. అన్ని భాష‌ల్లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీ క‌లెక్ష‌న్స్ తో పాత రికార్డుల‌ను చెరిపేసి కొత్త రికార్డుల‌ను నెల‌కొల్పుతోంది.

ముఖ్యంగా హిందీ మార్కెట్ లో `కేజీఎఫ్2` సినిమా సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్క‌డి స్టార్ హీరోల సినిమాలు సైతం కేజీఎఫ్ 2 ముందు వెల‌వెల‌బోయాయి. ఇక తాజాగా ఈ చిత్రం బాలీవుడ్ స్టార్‌ అమీర్ ఖాన్ నటించిన ఇండియన్ హ్యయేస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ `దంగల్` లైఫ్ టైమ్ కలెక్షన్‌ను దాటేసింది.

ఇంతవరకూ హిందీలో 511.3 కోట్లను సాధించి `బాహుబలి 2` మొదటి స్థానంలో ఉంటే, 387.4 కోట్ల వసూళ్లతో `దంగల్` రెండో స్థానంలో నిలిచింది. ఇన్నాళ్లు దంగ‌ల్ స్థానాన్ని ఏ బాలీవుడ్ సినిమా ద‌క్కించుకోలేక‌పోయింది. కానీ, ఓ డ‌బ్బింగ్ చిత్ర‌మైన కేజీఎఫ్ 2 కేవలం 21 రోజుల్లోనే రూ.391.65 కోట్లను రాబట్టిన దంగల్ స్థానాన్ని ఆక్రమించేసింది. ఆమిర్ ఖాన్ సినిమా మూడో స్థానానికి ప‌డిపోయింది. దీంతో బాలీవుడ్‌లో సౌత్ సినిమాల విష‌యంలో వ‌ణుకు మొద‌లైందనే ప్ర‌చారం ఊపందుకుంది.

author avatar
kavya N

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu