సినిమా

KGF 2: ఫ‌స్ట్ డే కుమ్మేసిన `కేజీఎఫ్ 2`.. టోట‌ల్ క‌లెక్ష‌న్ ఎంతో తెలుసా?

Share

KGF 2: క‌న్నడ స్టార్ హీరో య‌శ్ , డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` 2018లో దేశ‌వ్యాప్తంగా ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు చాప్ట‌ర్ 1 కు కొన‌సాగింపుగా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` వ‌చ్చింది. దాదాపు మూడేళ్ల నుంచీ సినీ ప్రియుల‌ను ఊరిస్తూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు నిన్న అట్ట‌హాసంగా విడుద‌లైంది.

హోంబలి ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించ‌గా.. రవి బస్రూర్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. అలాగే ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ క‌థ ఏమీ ఉండ‌క‌పోయినా.. హీరో ఎలివేషన్ సీన్స్‌, యాక్షన్స్ ఎపిసోడ్స్‌, ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

మొత్తానికి విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వాంసం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ డే ఈ మూవీ వీర కుమ్ముడు కుమ్మేసింది. విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్‏లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. మ‌రి ఇక్క‌డ కేజీఎఫ్ 2 టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేసేయండి.

నైజాం: రూ. 9.68 కోట్లు
సీడెడ్: రూ. 2.84 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: రూ. 1.70 కోట్లు
తూర్పు: రూ. 1.19 కోట్లు
పశ్చిమ: రూ. 84 ల‌క్ష‌లు
గుంటూరు: రూ. 1.13 కోట్లు
కృష్ణ: రూ. 90 ల‌క్ష‌లు
నెల్లూరు: రూ. 81 ల‌క్ష‌లు
——————————
ఏపీ+తెలంగాణ టోట‌ల్‌= రూ. 19.09 కోట్లు (రూ. 31కోట్లు~ గ్రాస్)
——————————

కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈ సినిమా ఇక్క‌డ క్లీన్ హిట్ అవ్వాలంటే మొద‌టి రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా రూ. 59.91 కోట్ల షేర్ ని అందుకుంటే స‌రిపోతుంది.


Share

Related posts

Pawan Kalyan: నైజాం లో ఏ హీరో సృష్టించని రికార్డ్ ఫస్ట్.. పవన్ ఫ్లాప్ సినిమా సృష్టించింది..!!

sekhar

Taapsee Pannu: తాప్సీకి సాయం చేసేందుకు ముందుకొచ్చిన మ‌హేష్‌..ఏమైందంటే?

kavya N

టాలీవుడ్ లో నాని మార్కెట్ ఇలా ఉందేంటని వాళ్ళంతా షాక్ లో ఉన్నారట ..!

GRK