KGF 2: కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తాజా చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 2`. 2018లో విడుదలై ఘన విజయం సాధించిన `కేజీఎఫ్ చాప్టర్ 1`కు కొనసాగింపుగా ఈ మూవీని రూపొందింఆచరు. హోంబలి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది.
సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేశ్ ఇందులో కీలక పాత్రలను పోషించగా.. రవి బస్రూర్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో నిన్న గ్రాండ్‌గా ఈ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాన్ స్టాప్ యాక్షన్ సీన్స్ నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టేసిందని చెప్పాలి.
మొత్తానికి అంచనాలను బాగానే అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ను రాబడుతూ దుమ్ము దులిపేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ నయా అప్డేట్ బయటకు వచ్చింది. కేజీఎఫ్ చాప్టర్ 1 హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారికే ఈసారి చాప్టర్ 2 తాలూకా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కలు దక్కాయి.
థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి విడుదల చేసేందుకు అమెజాన్ వారు నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన కేజీఎఫ్ 2 అమెజార్ ప్రైమ్‌లో మే 13న స్ట్రీమింగ్ చేసేందుకు డేట్ లాక్ చేశారని టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే.. సినీ ప్రియులు పండగ చేసుకోవడం ఖాయం.