KGF 2: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో 2018 వ సంవత్సరంలో వచ్చిన “బాహుబలి 2” కలెక్షన్ ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెవెల్ ని “బాహుబలి 2” మరో ఎత్తుకి తీసుకెళ్ళింది. సినిమాలో యుద్ధ సన్నివేశాలు… ప్రభాస్ నీ రాజు గా చూపించడంలో కథని సరికొత్తగా ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో రాజమౌళి పనితనం తెరపై బాగా పండింది. దీంతో “బాహుబలి 2” కలెక్షన్ ల సునామీ సృష్టించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 14వ తారీకు మరో గ్రేట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “కేజిఎఫ్ 2” రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో “కేజిఎఫ్ 2” పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకోగా.. అంచనాలకు తగ్గట్టు “కేజిఎఫ్ 2” ఉండటంతో విడుదలైన ప్రతి చోట బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. సినిమాలో హీరోయిజం ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో తెరపై చూపించాడు డైరెక్టర్. హీరో యాష్ నీ ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో మరి ఇంత పవర్ ఫుల్ గా చూపించడం.. సినిమా చూసే ఆడియన్స్ “కేజిఎఫ్ 2” నీ బాగా ఆదరించారు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ సాధించటం తెలిసిందే. ఇంకా విజయవంతంగా సినిమా ధియేటర్ లలో ప్రదర్శితమవుతోంది.
ఇటువంటి తరుణంలో “కేజిఎఫ్ 2” తాజాగా “బాహుబలి 2” రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. కలెక్షన్ ల పరంగా కాదండోయ్. విషయంలోకి వెళితే “కేజిఎఫ్ 2” బుక్ మై షో బుకింగ్స్ లో అత్యధిక టికెట్లు కొనుగోలు చేసిన సినిమాగా ఆల్టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం 17.1 మిలియన్ ల టికెట్స్ అమ్మకం జరపటంతో .. బుక్ మై షో బుకింగ్స్ లో “బాహుబలి 2” పేరిట ఉన్న రికార్డ్ “కేజిఎఫ్ 2” బ్రేక్ చేయడం జరిగింది. కలెక్షన్ ల పరంగా మాత్రం “బాహుబలి 2” ఇంకా టాప్ లోనే ఉంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!