సినిమా

KGF 2: 3వ రోజూ అద‌ర‌గొట్టిన‌ `కేజీఎఫ్ 2`.. ఇంకా ఎంత రాబ‌ట్టాలంటే?

Share

KGF 2: క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ హీరోగా ప్రముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన తాజా చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`. 2018లో విడుద‌లై దేశ‌వ్యాప్తంగా ఘ‌న విజ‌యం సాధించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`కు కొన‌సాగింపుగా ఈ మూవీని రూపొందింఆచ‌రు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేశ్ ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

హోంబలి ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రం.. భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న రిలీజైంది. అన్ని భాష‌ల్లోనూ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ దూసుకుపోతోంది. మొద‌టి రెండు రోజులు రికార్డ్ బ్రేకింగ్ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూల్ చేసిన ఈ మూవీ.. 3వ రోజూ అద‌ర‌గొట్టింది.

ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ చిత్రం మూడో రోజు రూ. 10.29 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. ఇక మ‌రి ఏరియాల వారీగా మొద‌టి మూడు రోజులు కేజీఎఫ్ 2 టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేసేయండి.

నైజాం: రూ. 22.67 కోట్లు
సీడెడ్: రూ. 6.12 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: రూ. 3.86 కోట్లు
తూర్పు: రూ. 2.51 కోట్లు
పశ్చిమ: రూ. 1.73 కోట్లు
గుంటూరు: రూ. 2.35 కోట్లు
కృష్ణ: రూ. 2.08 కోట్లు
నెల్లూరు: రూ. 1.43 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ టోట‌ల్‌= రూ. 42.75 కోట్లు (రూ. 68 కోట్లు~ గ్రాస్)
——————————

కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈ సినిమా ఇక్క‌డ క్లీన్ హిట్ అవ్వాలంటే మొద‌టి రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా రూ. 36.25 కోట్ల షేర్ ని అందుకుంటే స‌రిపోతుంది.


Share

Related posts

లేడీ గెటప్‌లో సేతుపతి

Siva Prasad

ఫేక్ ఫోటో.. యూనిట్ వివరణ

Siva Prasad

త‌మ‌న్నా… అంత ప‌ని చేసిందా!

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar