సినిమా

KGF 2: రూ. 345 కోట్ల టార్గెట్‌.. 6 రోజుల్లో వ‌చ్చిందెంత‌..? రావాల్సిందెంత‌..?

Share

KGF 2: 2018లో సైలెంట్‌గా వ‌చ్చి దేశ‌వ్యాప్తంగా సెన్సేష‌న్ సృష్టించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`కు కొన‌సాగింపు ఇప్పుడు `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` వ‌చ్చేసింది. క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ హీరోగా ప్రముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విల‌న్ పాత్ర‌ను పోషించారు.

హోంబలి ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సినిమా అనేక వాయిదాల అనంత‌రం ఏప్రిల్ 14న అట్ట‌హాసంగా విడుద‌లైంది. తొలి రోజే సూపర్‌ హిట్‌ టాక్‌ సంపాదించుకొని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 6 రోజుల్లో ఏకంగా రూ. 336.27 కోట్ల షేర్‌, రూ. 676.15 కోట్ల గ్రాస్‌ వసూళ్ల‌ను రాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ మూవీ అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌తో స‌రికొత్త రికార్డుల‌ను సెట్ చేస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 345 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దూకిన ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొద‌టి ఆరు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా మ‌రో రూ. 11.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సరిపోతుంది. ఇక కేజీఎఫ్ 2 ఆరు రోజుల వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం – 32.31 కోట్లు
సీడెడ్ – 8.70 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 5.69 కోట్లు
ఈస్ట్ – 4.24 కోట్లు
వెస్ట్ – 2.61 కోట్లు
గుంటూరు – 3.45 కోట్లు
కృష్ణా – 3.11 కోట్లు
నెల్లూరు – 2.06 కోట్లు
——————————
ఏపీ + తెలంగాణ = 62.17 కోట్ల షేర్‌ ( 98.50 కోట్ల-గ్రాస్‌)
——————————

క‌ర్నాట‌క – 62.80 కోట్లు
త‌మిళ‌నాడు – 20.70 కోట్లు
కేర‌ళ – 16.15 కోట్లు
హిందీ – 120.10 కోట్లు
ఓవ‌ర్సీస్ – 54.35 కోట్లు
—————————-
వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్ = 336.27 కోట్ల షేర్ (676.15 కోట్ల-గ్రాస్‌)
—————————-

 


Share

Related posts

ముద్ర… టీజ‌ర్ త్వ‌ర‌లో విడుద‌ల‌

Siva Prasad

Intinti Gruhalakshmi: సంతోషంగా ఉన్న తులసిని చూసి నందు ఏం చేశాడంటే..!? తులసితో బెట్ వేసిన ప్రవళిక..

bharani jella

Narappa Review: ‘నారప్ప’ మూవీ రివ్యూ

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar