KGF 2: “కేజిఎఫ్ 2” సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఏ మాత్రం తగ్గటం లేదు. ఏప్రిల్ 14వ తారీకు విడుదలైన ఈ సినిమా.. నెల రోజులు అయినా గాని సునామీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కేజిఎఫ్ 2 దాటికి స్టార్ హీరోల సినిమాలు బొక్క బోర్లా పడుతున్నాయి. “కేజిఎఫ్ 2” సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు మిగతా సినిమాల్లో ఉండే సన్నివేశాలను… ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి కనబడటం లేదు. హిందీ లో ఇప్పటికీ 400 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పనితనానికి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినీ ప్రేమికులు నీరాజనాలు పలుకుతున్నారు. రాజమౌళి సైతం దాటుకుని వెళ్ళిపోయే సత్తా ప్రశాంత్ నీల్ కి ఉందని..”కేజిఎఫ్ 2″ చూసిన.. చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. నార్త్ బెల్ట్ లో “కేజిఎఫ్ 2” థియేటర్లు ఇంకా హౌస్ఫుల్ అవుతూ ఉండటం తో.. ఓవరాల్ రన్ టైం లో ఎంత కలెక్ట్ చేస్తుందని అన్నది సస్పెన్స్ గా నెలకొంది. పరిస్థితి ఇలా ఉంటే సినిమా రిలీజ్ కు ముందు “కేజిఎఫ్ 2” నుండి రిలీజ్ అయిన తుఫాన్ సాంగ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
విడుదలైన ప్రతి భాషలో ఏ సాంగ్ సినిమాపై మంచి అంచనాలు పెంచటం మాత్రమే కాదు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి విత్తనం వేసినట్లయింది. తెలుగులో కూడా తుఫాన్ సాంగ్ అనేక రికార్డులు యూ ట్యూబ్ లో రిలీజ్ అవ్వకముందు క్రియేట్ చేసింది. అటువంటి సాంగ్ … మే 18 వ తారీకు.. ఉదయం 11 గంటలకు.. రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. తుఫాన్ ఫుల్ వీడియో సాంగ్ మే 18 ఉదయం 11 గంటల నుండి యూట్యూబ్ లో అందుబాటులోకి రానుంది.