KGF 2: కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. 2018లో దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసిన `కేజీఎఫ్ చాప్టర్ 1`కు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. హోంబలి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రను పోషించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం.. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపే కలెక్షన్స్‌ను రాబడుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విడుదలైన ఏడు రోజుల్లోనే కొండంత బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను బ్రేక్ చేసిన ఈ సినిమా.. ఇప్పకీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. పదకొండో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే దక్కించుకుని భారీ లాభాలతో దూసుకుపోతోంది. ఇక 11 డేస్‌లో కేజీఎఫ్ 2 వరల్డ్ వైడ్‌గా సాధించిన టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం – 38.18 కోట్లు
సీడెడ్ – 10.28 కోట్లు
ఉత్తరాంధ్ర – 6.68 కోట్లు
ఈస్ట్ – 5.00 కోట్లు
వెస్ట్ – 3.13 కోట్లు
గుంటూరు – 4.08 కోట్లు
కృష్ణా – 3.69 కోట్లు
నెల్లూరు – 2.48 కోట్లు
——————————
ఏపీ + తెలంగాణ = 73.32 కోట్ల షేర్ ( 117.60 కోట్ల-గ్రాస్)
——————————
కర్నాటక – 79.80 కోట్లు
తమిళనాడు – 33.10 కోట్లు
కేరళ – 22.58 కోట్లు
హిందీ – 162.05 కోట్లు
ఓవర్సీస్ – 74.15 కోట్లు
—————————-
వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ = 445.00 కోట్ల షేర్ (900.55 కోట్ల-గ్రాస్)
—————————-
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 347 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ టార్గెట్ ఏడు రోజుల్లోనే రీచ్ అయిన కేజీఎఫ్.. ఇప్పుడు లాభాలతో దూసుకుపోతోంది. 11 డేస్ పూర్తి అయ్యే సరికి రూ. 98 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.