KGF 2: “కేజిఎఫ్ 2” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్లను షేక్ చేసి పడేస్తోంది. పోయిన నెలలో “ఆర్ఆర్ఆర్” థియేటర్లను ఉర్రూతలూగించగా ఇప్పుడు…”కేజిఎఫ్ 2″ మోత మోగిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్… దర్శకత్వం పనితనానికి బాలీవుడ్ మొదలుకొని దక్షిణాది సినిమా ప్రేమికుల వరకు అందరు ఫిదా అయిపోయారు. రాజమౌళికి ఏమాత్రం తీసుపోని డైరెక్టర్.. ప్రశాంత్ నీల్ అని కొనియాడుతున్నారు. ఇద్దరూ కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లారని సెలెబ్రిటీలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది సినిమా రంగాన్ని చిన్నచూపు చూసే బాలీవుడ్ ఇండస్ట్రీకి కంటి మీద కునుకు లేకుండా ఈ ఇద్దరు దర్శకులు.. తమ సినిమాలతో.. సరికొత్త రికార్డులు బాలీవుడ్ లో కూడా క్రియేట్ చేస్తున్నారని ఫిలిం క్రిటిక్స్ చెప్పుకొస్తున్నారు. “కేజిఎఫ్ 2” అన్ని రకాల ప్రేక్షకులను అలరించే సినిమాగా తెరకెక్కడం తో.. ఈ సినిమా విడుదల అయి మూడు రోజులకి విడుదలైన ప్రతి చోట రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టింది. కేజిఎఫ్ మొదటి భాగం కంటే “కేజిఎఫ్ 2” లో చాలా వైలెంట్ గా హై వోల్టేజ్ సీన్స్ బాగా తీశారని సినిమా చూసిన ఆడియెన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే సమయంలో “కేజిఎఫ్ 2” సినిమా చివరిలో చాప్టర్ త్రీ కూడా రాబోతున్నట్లు చెన్నై హింట్ ఇచ్చే విధంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్… సినిమా తెరకెక్కించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు “కేజిఎఫ్ 2” ఇంకా సినిమా ధియేటర్ లలో ఉండగానే “కేజిఎఫ్ 3” కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్… చెప్పినట్లు కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. హోమబుల్ ఫిల్మ్స్ నిర్మాణ ప్రొడక్షన్స్ “కేజిఎఫ్ 3” మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈసారి ఏకంగా “కేజిఎఫ్” కోసం అమెరికా దేశం కలుగజేసుకున్నట్లు…”కేజిఎఫ్ 2″ లో చూపించడంతో రాఖీ బాయ్ ఇంటర్నేషనల్ డాన్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని తాజా వార్తపై సినిమా ప్రేక్షకులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.