సినిమా

KGF 2: 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన “కేజిఎఫ్ 2”..!!

Share

KGF 2: “కేజిఎఫ్ 2” గత నెల 14 వ తారీకు విడుదల అయిన సంగతి తెలిసిందే. విడుదలైన రోజే అంబేద్కర్ జయంతి ఆ తర్వాత గుడ్ ఫ్రైడే తోపాటు వీకెండ్ కావటంతో ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వచ్చాయి. మొదటి రోజే సెకండ్ షో పడకముందే వందకోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కేజిఎఫ్ మొదటి చాప్టర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ క్రేజ్ బేస్ చేసుకుని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ …యాష్ నీ “కేజిఎఫ్ 2” లో మరింత వైలెంట్ గా చూపించటంతో.. పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉండటంతో సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది.

kgf chapter 2 join's in thousand crore club

“కేజిఎఫ్ 2” ప్రీ రిలీజ్ బిజినెస్ అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. ఇక బొమ్మ థియేటర్ లో పడ్డాక… ఎక్కడా కూడా కేజిఎఫ్ మొదటి చాప్టర్ కి తక్కువ కాకుండా యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో.. విడుదలైన ప్రతి చోట సూపర్ డూపర్ హిట్టయ్యింది. కలెక్షన్ల విషయంలో అనేక రికార్డులు కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా రెండు వారాలకే “కేజిఎఫ్ 2” 1000 కోట్ల క్లబ్ లో చేరటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.kgf chapter 2 join's in thousand crore club

ఈ పరిణామంతో సౌత్ ఇండస్ట్రీ నుండి 1000 కోట్లు కలెక్ట్ చేసిన మూడో సినిమాగా “కేజిఎఫ్ 2” నిలిచింది. తొలి రెండు స్థానాల్లో ‘బాహుబలి 2’ .. ‘ఆర్ ఆర్ ఆర్’ ఉన్నాయి. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్…యాష్ క్రేజ్ ఊహించని విధంగా దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక ఇదే సమయంలో “కేజిఎఫ్ 3” కూడా ఉన్నట్లు “కేజిఎఫ్ 2” చివరిలో హింట్ ఇవ్వటంతో మూడోభాగం విషయంలో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇక ఓవరాల్ గా పూర్తి రన్ టైంలో KGF 2 మరింత కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Share

Related posts

మహేష్ బాబు – పూరి మధ్య ఉన్న బంధం ఇప్పటికైనా అర్థం అవుతుందా ..?

GRK

పూరి, చిరు సీక్రెట్ మీటింగ్ .. ఫ్యాన్స్ కోసమేనా ..?

GRK

Allu Arjun: సౌత్ ఇండియా లో కోట్లలో సంపాదిస్తున్న టాప్ హీరో అల్లు అర్జున్ మొదటి సంపాదన ఎంతో తెలుసా..??

sekhar