KGF 2 Review: నటీనటులు: యశ్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, అర్చన, రామచంద్ర రాజు, అచ్యుత్ కుమార్, మాళవిక అవినాశ్, వశిష్ఠ ఎన్.సింహ, ఈశ్వరీరావు, రావు రమేశ్, టి.యస్.నాగాభరణ, శరణ్ శక్తి తదితరులు.
సినిమాటోగ్రఫి: భువన్ గౌడ
సంగీతం: రవి బస్రూర్
నిర్మాత: విజయ్ కిరగండూర్
కథ, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
పరిచయం :
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యాష్ కాంబినేషన్ లో వచ్చిన “కేజిఎఫ్” మొదటి భాగం గతంలో సెన్సేషన్ క్రియేట్ చేయటం తెలిసిందే. ఇప్పుడా మొదటి భాగానికి సీక్వెల్ గా “కేజిఎఫ్ 2” తెరకెక్కడం తో మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. “కేజిఎఫ్” మొదట కన్నడంలో తెరకెక్కగా అక్కడ ఇండస్ట్రీ హిట్ కావడంతో తర్వాత మిగతా భాషల్లో డబ్ అయి అన్నిచోట్ల.. విజయం సాధించడం జరిగింది. దీంతో ఇప్పుడు “కేజిఎఫ్ 2” కి ఊహించని క్రేజీ ఏర్పడటంతో ఈ రోజు విడుదలైన ఈ సినిమా.. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబడుతోంది. సినిమా చూసిన ప్రేక్షకులు ముఖ్యంగా ఓవర్సీస్ లో శివ పడిపోవటంతో అక్కడ అభిమానులు సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టైం ప్రస్తుతం గట్టిగా నడుస్తుందని మరోసారి తన డైరెక్షన్ దమ్ముంటే నిరూపించాడని.. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫస్టాఫ్ లో హీరో ఇంట్రడక్షన్. ఇంటర్వెల్ సీన్స్ అయితే కళ్ళు చెదిరే రీతిలో గూస్ బమ్స్ వచ్చే విధంగా చూపించడం జరిగిందని ఆడియన్స్ అంటున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో సినిమా నిలబెట్టిందని చెప్పుకొస్తున్నారు. మరోసారి యాష్… ప్రశాంత్ నీల్.. బాక్స్ ఆఫీసు పై దండయాత్ర స్టార్ట్ చేశారు అని.. ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ 350 కోట్లు దాకా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని … సినిమాకి వస్తున్న రెస్పాన్స్ బట్టి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
స్టోరీ:
“కేజిఎఫ్” ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుండే..”కేజిఎఫ్ 2″ కొనసాగింపు. మొదటి పార్టు లో హీరో రాకీ.. బంగారు గనుల్లో పనిచేసే కార్మికులు హింసించే విలన్లను మట్టు బేట్టడం తెలిసిందే. ఆ తర్వాత కేజిఎఫ్ గనుల యజమాని గరుడ నే లేకుండా చేస్తాడు. ఈ దెబ్బతో గనుల్లో పనిచేసే కార్మికులకి… ఒక్కసారిగా రాకీ బానిస సంకెళ్ళు తెంచేసి వాళ్ళ అభిమానం సంపాదించుకుంటాడు. వాళ్లలో ఒక నాయకుడిగా కింగ్ మాదిరిగా . … రాణిస్తూ బంగారు గనుల పై కన్నేసిన ప్రతి ఒక్కరిని.. అంతమొందిస్తూ మరికొంతమందిని.. తన దారిలోకి తెచ్చుకుంటాడు. ఇక కేజిఎఫ్ మొత్తం తన వశం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రీనా తండ్రి రాజేంద్ర దేశాయ్, గరుడ సోదరుడు దయ, ఆండ్రుస్.. తదితరులు ఇక తప్పని పరిస్థితుల్లో రాకీ తో… చేతులు కలుపుతారు. ఇక ఇదే సమయంలో రాకీ … కూడా వీరనే ఓ కంట కనిపెడుతూనే… రీనా నీ తన వెంట పెట్టుకుని కేజిఎఫ్ కి తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ఎలాగైనా రాకీ నీ మళ్లీ కేజిఎఫ్ నుండి బయటకు పంపేలా.. రక రకాల కుట్రలు రీనా తండ్రి రాజేంద్ర దేశాయ్, గరుడ సోదరుడు దయా, ఆండ్రూస్ తదితరులు చేస్తుంటారు. మొత్తానికి చివరాకరికి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఫలించి రాకీ నీ కేజిఎఫ్ నుండి బయటకు పంపేలా చేస్తారు. ఇదే సమయంలో అధీరా బ్రతికే ఉన్నాడు అన్న విషయం రీనా తండ్రి రాజేంద్ర దేశాయ్, గరుడ సోదరుడు దయా, ఆండ్రూస్ కి తెలుస్తోంది. దీంతో వీళ్లంతా రాకీ పై మరింత రెచ్చిపోతారు. అధీరా…రాకీ నీ చావు దెబ్బ తీస్తాడు. దీంతో పరిస్థితి మరింత దిగజారే పోవడంతో ఇలాంటి టైంలో..అధీరా నీ ఎదుర్కోవటం అంత శ్రేయస్కరం కాదని రాకీ దుబాయ్ వెళ్లి పోతాడు. అక్కడి నుండి మళ్లీ రాకీ కేజిఎఫ్ కి ఎలా వచ్చాడు? తనని చావుదెబ్బ తీసిన అధీరా(సంజయ్ దత్) కి ఎలా గుణపాఠం చెప్పాడు..? ఇక ఇదే సమయంలో సీబీఐ అధికారుల సలహాతో కేజిఎఫ్ నీ పూర్తిగా ప్రభుత్వ చేతుల్లోకి తీసుకోవాలనుకున్న ప్రధానిని రాకీ ఎలా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు…? మళ్లీ కేజిఎఫ్ లో తన జెండా ఎలా పతాడు..? అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే.
పాజిటివ్ పాయింట్స్:
* రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
* సినిమాటోగ్రఫీ
*యాక్షన్ సన్నివేశాలు
* ఇంటర్వెల్ సీన్
నెగిటివ్ పాయింట్లు:
* స్టోరీ
*గజిబిజి స్క్రీన్ ప్లే
* ఎమోషనల్ సన్నివేశాలు.
*విలన్ పాత్రలు
* సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా
*హీరోయిన్
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!