KGF 2: “కేజిఎఫ్ 2” దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్ లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వ తారీకు విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ ల సునామీ సృష్టిస్తోంది. మొదటి చాప్టర్ మాదిరిగానే “కేజిఎఫ్ 2” చాప్టర్ వుండటంతో థియేటర్లకు జనాలు పోటెత్తుతున్నారు. సినిమాలో హీరోయిజం … ఎలివేషన్స్ తనదైన శైలిలో దర్శకుడు చూపించటం అదే రీతిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండటంతో ..”KGF 2″కి జనాలు నీరాజనాలు పడుతున్నారు. దేశంలో సినిమాల పరంగా కన్నడ ఇండస్ట్రీ అతి చిన్నది అంటుంటారు.ఇటువంటి ఇండస్ట్రీ నుండి ఇప్పుడు మొత్తం ఇండియాని షేక్ చేసే సినిమా రావటంతో కన్నడ సినిమా ప్రేక్షకులు హీరో యాష్ నీ… అదేవిధంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఏకంగా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు యాష్ తన పూర్తి టైమ్ కేటాయించడం జరిగింది. వాస్తవానికి కరోన రాకముందు ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందట. కానీ మహమ్మారి కరోనా వచ్చాక… బయట ప్రపంచంలో పరిస్థితులు మారడంతో మిగతా 20 శాతం షూటింగ్ కంప్లీట్ చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టడం మాత్రమే కాదు థియేటర్ లలో మాత్రమే రిలీజ్ చేయాలని టైం తీసుకోవడం జరిగింది అంట.ఏది ఏమైనా నాలుగు సంవత్సరాల కష్టానికి కేజిఎఫ్ సెకండ్ చాప్టర్ తీసుకొస్తున్న కలెక్షన్స్ సినిమా యూనిట్ ని ఆనందంలో ముంచెత్తుతూ ఉన్నాయి. సినిమా విజయం సాధించడంతో హీరో యాష్ తన కుటుంబంతో ఫుల్ హ్యాపీగా హాలిడే ట్రిప్ వేయడం జరిగింది. తన ఇద్దరు పిల్లలతో భార్యతో కలిసి బీచ్ ఒడ్డున యాష్ సేద తీరుతున్నడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!