Categories: సినిమా

KGF: రికార్డులమీద రికార్డులు బద్దలు కొడుతున్న రాకీభాయ్!

Share

KGF: KGF II ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే వుంది. థియేటర్లలో ఇంకా మోత మోగుతూనే వుంది. అవును.. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR ప్రభంజనం తరువాత సరిగ్గా 20 రోజులకు రిలీజయింది KGF. రిలీజు రావడంతోనే రికార్డుల మోత షురూ చేసింది. తాజాగా RRR 50 రోజుల పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా KGF 2 మరో అరుదైన ఫీట్ ని సెట్ చేసింది. బాలీవుడ్లో ఈ సినిమా వసూళ్ల సునామి సృష్టిస్తోంది. అవును.. KGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ పరంగా మరో అరుదైన రికార్డును అందుకుంది. 2022లో 5 వారాంతంలో కూడా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది.

KGF Rocky Bhai breaking all records

KGF: రికార్డుల మీద రికార్డులంటే ఇవే:

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF – చాప్టర్ 2 నాలుగు వారాల క్రితం విడుదలై, కన్నిడుగుల సత్తాను చాటుతోంది. హిందీ మార్కెట్లో KGF 2 రూ. 300 కోట్ల మార్క్ ని అత్యంత వేగంగా అందుకుంది. రికార్డు సమయంలో 400 కోట్ల మార్క్ కి చేరుకుని ఇప్పుడు 5 వారాంతంలో నడుస్తున్న ఈ చిత్రం దాని కలెక్షన్లు స్థిరంగా ఉన్నాయని ప్రూవ్ చేసింది. బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం.. KGF – చాప్టర్ 2 ఐదవ-వారాంతంలో అత్యుత్తమ వసూళ్లను సాధించింది. అదే సమయంలో 2022లో ఇంతకు ముందు విడుదల చేసిన వాటితో పోల్చి చూడగా.. చివరి రోజు 6.35 కోట్ల వసూళ్లను సాధించింది. KGF 2 చిత్రం 2022లో అత్యధిక ఐదవ వారాంతపు గ్రాసర్ గా నిలిచింది.

KGF Rocky Bhai breaking all records

5th వీక్ కలెక్షన్లు:

ఇకపోతే, KGF 2 రికార్డుల పరంగా RRR రికార్డుల్ని బద్దలు కొట్టింది. RRR ఐదో వారంలో రూ. 3.32 కోట్లు వసూలు చేయగా.. ది కాశ్మీర్ ఫైల్స్ రూ. 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే KGF 2 మాత్రం 5వ వారంలో కూడా బాక్సాఫీస్ రన్ ను కొనసాగించింది.

2022 టాప్ 5th వీక్ గ్రాసర్స్:
KGF చాప్టర్ – 2: రూ. 6.35 కోట్లు
RRR: రూ. 3.32 కోట్లు
కాశ్మీర్ ఫైల్స్: రూ. 2.50 కోట్లు


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

5 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

6 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

57 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

1 hour ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago