Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల కోవిడ్ థర్డ్ వేవ్ వల్ల చాలా వరకు సినిమాల నిర్మాణం ఆగిపోవడంతో ఆయన కూడా కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు అదుపులోకి రావడంతో హీరోలందరూ కెమెరా ముందు వచ్చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఇటీవల కోవిడ్ బారిన పడి కోలుకొని వెంటనే సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో పవన్ కూడా ఆయన హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.
ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కు రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో రానా మరో హీరోగా నటిస్తుండగా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక యంగ్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే తమన్ అందించిన పాటలు సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రాసిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను సింగర్స్ శ్రీకృష్ణ పృథ్వీ, చంద్రలతో పాటు కిన్నెర మొగిలయ్య, రామ్ మిర్యాలతో పాడించారు. ఈ పాట ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
Bheemla nayak: అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు..!
ఇక ఈ పాటతో కిన్నెర మొగిలయ్య లైమ్ లైట్లోకి రావడమే కాదు ఏకంగా ఆయనకు ఇటీవల పద్మశ్రీ పురస్కారం కూడా దక్కడం విశేషం. కాగా, ఇప్పుడు మరో సాంగ్ కోసం బాలీవుడ్ ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్‌ను తీసుకున్నారు. తాజాగా సంగీత దర్శకుడు ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్‌ను పెట్టారు. ఈ పోస్ట్‌లో దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ – లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, సింగ కైలాష్ ఖేర్‌లతో కలిసి ఉన్న ఫొటోను పెట్టి దానికి కామెంట్స్ పెడుతూ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండటంతో పాటు అభిమానులలో భారీగా అంచనాలను పెంచుతోంది. ఇక అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ నెలలోనే భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.