Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం `ఖిలాడి`. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. గత కొద్ది నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఇప్పటికే చిత్ర టీమ్ వదిలిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమా మీద భారీ అంచనాలను పెంచేయగా.. నిన్న వచ్చిన ట్రైలర్ రవితేజ అభిమానులతో పాటు నెటిజన్లు సైతం విశేషంగా ఆకట్టుకుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచేసిన మేకర్స్.. తాజాగా ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం పిక్స్ చేశారు.
రేపు హైదరాబాద్ బంజారహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో సాయంత్రం 6:00 గంటలకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టర్‌ను కూడా వదిలారు. దీంతో ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే స్పెషల్ గెస్ట్ లేకుండానే ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.