Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం `ఖిలాడి`. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై హవీష్ కోనేరు, సత్యనారాయణ కోనేరు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదురి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రను పోషించారు.
భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 11న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 4.84కోట్లు షేర్ వసూల్ చేసిన రవితేజ.. రెండు రోజు మాత్రం బాగా డల్ అయిపోయాడు. టాక్ సరిగ్గా లేకపోవడం, టీజే టిల్లు చిత్రం పోటీగా దిగడంతో.. ఖిలాడి సెకెండ్ డే కేవలం 2.19 కోట్ల షేర్‌నే రాబట్టగలిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఖిలాడి 2 డేస్ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి..
నైజాం- 2.64 కోట్లు
సీడెడ్-.0. 89 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.75 కోట్లు
తూర్పు గోదావరి- 0.40 కోట్లు
పశ్చిమ గోదావరి- 0.33 కోట్లు
గుంటూరు- 0.67 కోట్లు
కృష్ణ- 0.28 కోట్లు
నెల్లూరు- 0.29 కోట్లు
————————————————————————
ఏపీ+తెలంగాణ మొత్తం- 6.25కోట్లు(10.35కోట్లు~ గ్రాస్)
————————————————————————-
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.52 కోట్లు
ఓవర్సీస్ – 0.26 కోట్లు
————————————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్- 7.03కోట్లు(12కోట్లు~ గ్రాస్)
————————————————————————-
కాగా, ప్రపంచవ్యప్తంగా ఈ చిత్రం రూ.22.80 కోట్లు ప్రీ రిలీజ్ బెజినెస్ చేయగా.. రూ.23.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే మొదటి రెండు రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.16.47 కోట్లను రాబట్టాల్సి ఉంది. మరి లాంగ్ రన్లో రవితేజ ఈ భారీ టార్గెట్‌ను రీచ్ అవుతాడో..లేదో..చూడాలి.