33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
సినిమా

Khiladi Trailer: అదిరిపోయిన `ఖిలాడి` ట్రైల‌ర్‌.. చూసి తీరాల్సిందే!

Share

Khiladi Trailer: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఖిలాడి`. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై హవీష్‌, సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు క‌లిసి నిర్మించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో మీనాక్షి చౌద‌రి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా న‌టించారు.

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ ఖిలాడి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. కొద్దిసేప‌టికే నెట్టింట ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. `ఎప్పుడూ ఒకే టీంకు ఆడటానికి నేషనల్ ప్లేయర్ ను కాదు. ఐపీఎల్ ప్లేయర్ ను.. ఎవడెక్కువ వాడుకుంటే వాడికే ఆడతాను..` అంటూ ర‌వితేజ డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగింది.

కొన్ని వందల కోట్ల అక్రమ డబ్బు చుట్టూ ఈ సినిమా సాగ‌నుంద‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. అలాగే ఈ చిత్రంలో ర‌వితేజ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. అందులో ఒక పాత్ర సూప‌ర్ ఫన్నీగా ఉండగా.. మరొక రోల్ ఫుల్ వైలెంట్‌గా ఉంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి రవితేజ సరసన చక్కగా సరిపోయారు.

అలాగే రొమాన్స్ విష‌యంలోనూ ర‌వితేజ రెచ్చిపోయార‌ని చెప్పాలి. యాక్షన్‌ సీక్వెన్స్‌, విజువ‌ల్స్‌, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు సైతం ఆక‌ట్టుకున్నాయి. ఇక `పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు.. ఈ ఆటలో ఒక్కడే కింగ్’ ‘మెటల్ డిక్టేటర్ లాగా ఇక్కడ మనీ డిక్టేటర్ ఉంటది` అంటూ ర‌వితేజ చివ‌రిగా చెప్పిన డైలాగ్ బాగా పేలింది. మొత్తానికి అదిరిపోయిన ఖిలాడి ట్రైల‌ర్‌ను ఖ‌చ్చితంగా చూసి తీరాల్సిందే. కాగా, ఈ సినిమాలో అన‌సూయ, అర్జున్ స‌ర్జా, మురళి శర్మ, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.


Share

Related posts

కాన్ఫిడెంట్‌గా ఉన్నాం

Siva Prasad

KGF 2: ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న “కేజిఎఫ్” హీరో..!!

sekhar

సృష్టిలో ఏదైనా సాధ్యమే

Siva Prasad