సినిమా

Kiara Advani: ప్రియుడికి కియారా బ్రేక‌ప్‌.. పెళ్లిదాకా వెళ్లి ఇప్పుడిలా చేశారా?

Share

Kiara Advani: కియారా అద్వానీ.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఫగ్లీ` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసి `ఎం.ఎస్.ధోని`తో గుర్తింపు పొందిన ఈ భామ‌.. `భరత్ అనే నేను` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత తెలుగులో `వినయ విధేయ రామ` మిన‌హా మ‌రే సినిమా చేయ‌లేదు.

కానీ, బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసి స్టార్ హోదాను ద‌క్కించుకుంది. అలాగే మ‌రోవైపు యంగ్ హీరో సిద్దార్థ్ మల్హ్రోత్రాతో ప్రేమాయ‌ణం న‌డిపిస్తూ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘షేర్షా’ సినిమాలో వీరిద్దరూ కలిసి తొలిసారి నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

అయితే షేర్షా షూటింగ్ స‌మ‌యంలోనే కియారా, సిద్దార్థ్ ల మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని, ఆ ప్రేమ డేటింగ్ వ‌ర‌కు వెళ్లింద‌ని బాలీవుడ్ మీడియా కోడై కోసింది. అందుకు త‌గ్గ‌ట్లు వీరిద్ద‌రూ క‌లిసి చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం, వెకేష‌న్స్‌కు వెళ్ల‌డంతో కియారా, సిద్దార్థ్ లు పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, తాజాగా ఈ జంట తమ రిలేషన్‌కి ఎండ్‌ కార్డ్‌ వేసేశార‌ట‌. ఇంత సడెన్‌గా ఏం జరిగిందో తెలియదు గానీ.. కియారా, సిద్దార్థ్ లు బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్ళ ప్రేమ ముగిసినట్టేనా అంటే బాలీవుడ్ మీడియా అవుననే స‌మాధానం ఇస్తోంది. దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోయినా సన్నిహిత వర్గాలు మాత్రం వీరు బ్రేకప్ నిజ‌మే అని చెబుతున్న‌ట్లు టాక్ నడుస్తోంది. ఏదేమైనా పెళ్లిదాకా వెళ్లి ఇప్పుడిలా ఈ జంట‌ విడిపోవ‌డంతో.. వారి వారి అభిమానులు బాగా హిట్ అవుతున్నారు.


Share

Related posts

Prabhas Mahesh: ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా ఓపెన్ గా చెప్పేసిన మహేష్ హీరోయిన్..!!

sekhar

F 3 : ఎఫ్ 3 కంప్లీట్ చేసిన వెంకీ, వరుణ్..!

GRK

Divi Vadthya Bigg Boss Season4 Contestants Photos

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar