Kiara Advani: కియారా అద్వానీ.. ఈమె గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల భామ.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆపై `వినయ విధేయ రామ` మూవీ చేయగా.. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఆ తర్వాత మరో తెలుగు సినిమాకు సైన్ చేయని కియారా.. బాలీవుడ్లో మాత్రం వరుస ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే లాంగ్ గ్యాప్ అనంతరం తెలుగులో ఈమె ఇటీవలె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమాలో చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ రెండు షెడ్యూల్స్‌ను సైతం పూర్తి చేసుకుంది. దీంతో పాటు భూల్ భూలయ్యా2 , గోవిందా నామ్ మేరా, జుగ్ జుగ్ జీయో సినిమాల్లో కియారా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే కియారా ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో యూత్‌ను విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తుంటుంది.
తాజాగా కూడా ఈ బ్యూటీ అదే చేసింది. పింక్ కలర్ ట్రెండీ ఫ్రాక్ ధరించిన కియారా చూపించాల్సిన యాంగిల్స్ అన్నీ చూపిస్తూ.. హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. ఆపై ఇందుకు సంబంధిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. మరి వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.