Spirit: నేషనల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్‌లో `స్పిరిట్` ఒకటి. ప్రభాస్ కెరీర్‌లో 25వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీకి `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్నాడు. గత ఏడాదే అఫీషియల్ అనౌన్మ్‌మెంట్ రాగా.. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ హై బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రస్టింగ్ టాక్ వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీలో పోటీ పడుతున్నారని గత వారం రోజులుగా టాక్ నడుస్తోంది.
మేకర్స్ ఈ ఇద్దరు హీరోయిన్లలోనే ఒకరిని ప్రభాస్‌కు జోడీగా ఎంపిక చేయనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. బాలీవుడ్‌లోనూ ఇదే వార్త హల్ చల్ చేస్తుండటంతో.. కియారా తరపు అధికార ప్రతినిధి స్పందించారు. స్పిరిట్ సినిమా కోసం తమని ఎవరూ ఇంతవరకూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సినిమాలో కియారా చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో నెట్టింట జరుగుతున్న ప్రచారం పుకార్లే అని తేలిపోయింది. కాగా, సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో `యానిమల్` సినిమా చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ `సలార్`తో బిజీగా ఉన్నారు. ఆయా ప్రాజెక్ట్స్ పూర్తైన వెంటనే స్పిరిట్ సినిమా పట్టాలెక్కనుంది.
ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు…
టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఓ రేంజ్లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…
లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు…
టాప్ 10 తెలుగు ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…
పోయిన శుక్రవారం భారీ అంచనాల నడుమ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటే `బింబిసార`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…
విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…