సినిమా

Kiara Advani: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Bollywood: బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ కియారా అద్వాని (Kiara Advani) సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దక్షిణాది రీమేక్ సినిమాలు నటించాలి అనే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం జరుగుతుందని తెలిపింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన “భూల్ భులయా 2” సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న కియారా అద్వాని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…ఓటిటి బాగా వ్యాప్తి చెందనప్పుడు “కబీర్ సింగ్” అనే సినిమా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మరోసారి చేయమన్నా గ్యారెంటీగా.. చేస్తాను.

Kiara Advani viral comments on south film industry

కానీ ఏదైనా రీమేక్ సినిమా..ఓటిటి లో ఉంది అంటే దాన్ని చేయాల్సి వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను అని తేలింది. కొన్ని సినిమాలు చాలా చిన్న రత్న లాగా ఉంటాయి. వాటిని కేవలం ఆ భాష ప్రాంతానికి చెందిన అభిరుచులకు అనుగుణంగా తెరకెక్కిస్తారు. దీంతో చాలా వరకు మిగతా జనాలకి ఆ సినిమా చేరదు. ఇటువంటి నేపథ్యంలో దేశంలో ఎక్కువగా మాట్లాడే హిందీ.. సినిమాలను.. కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఇ అటుఇటుగా కొన్ని సన్నివేశాలు మార్చి మళ్లీ సినిమా నిర్మిస్తే ఎక్కువ మంది జనాలు చూసే ఆస్కారం ఉందని.. ఆ విధంగా నిర్మించడం లో తప్పు లేదని.. కియారా స్పష్టం చేయడం జరిగింది.

Kiara Advani viral comments on south film industry

“భూల్ భులయా 2” మే 20వ తారీకు రిలీజ్ కానుంది. అదే రోజు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన “థాకడ్” కూడా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ సౌత్లో శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. తెలుగులో కియారా అద్వాని కి ఇది మూడో సినిమా. మొదట మహేష్ బాబు తో నటించిన “భరత్ అనే నేను” బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో చరణ్ తో “వినయ విధేయ రామ” నటించగా అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు రెండోసారి చరణ్ తో శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోంది.


Share

Related posts

RRR: థియేటర్ నుండి వెళ్లిపోయే టైం లో కూడా రికార్డ్ క్రియేట్ చేసిన “ఆర్ఆర్ఆర్”..!!

sekhar

Bheemla Nayak: భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ సందిగ్ధత.. వస్తుందో, రాదో!

Ram

రానాకి నో చెప్పిన స్టార్ హీరోయిన్‌.

Siva Prasad