Kiran Abbavaram : సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం ఉన్న వాళ్ళు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే ఎంతో కష్టం. కానీ సినిమాలపై వారికున్న ఇష్టాన్ని ఆ కష్టం కనబడకుండా చేస్తుంది. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి మంచి అవకాశాలను దక్కించుకుంటారు. అలాంటి వారిలో నటుడు కిరణ్ అబ్బవరం ఒకరని చెప్పవచ్చు. సినిమాలపై ఉన్న ఇష్టంతో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తన కెరియర్ ను ప్రారంభించాడు. ప్రస్తుతం మంచి పేరు, గుర్తింపును సంపాదించుకొని వెండి తెరపై హీరోగా సందడి చేస్తున్నారు కిరణ్.
“రాజావారు, రాణి వారు”చిత్రంతో కథానాయకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కిరణ్ ప్రస్తుతం “ఎస్. ఆర్ కళ్యాణమండపం”అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరణ్ జోడిగా ప్రియాంకా జవాల్కర్ సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ విడుదల అనంతరం కిరణ్ మాట్లాడుతూ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు…
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ…నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం అందుకే షార్ట్ ఫిలింస్ ద్వారా నా కెరీర్ ప్రారంభించాను. అనంతరం “రాజా వారు, రాణి వారు” చిత్రంలో కథానాయకుడిగా చేసే అవకాశం లభించింది. ఆ సినిమాలో నన్ను చూసిన అందరు ఎంతో అమాయకుడు అన్నారు. కానీ తరువాత చేసే చిత్రాలలో ఏదైనా భిన్నంగా ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ కథను రూపొందించాలని “ఎస్.ఆర్ కళ్యాణమండపం” కథ రాశానని,ఈ సినిమా తెరకెక్కించే సమయంలో ఎంతో మంది నాకు సహాయం చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేశారు. చాలామంది నాకు పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందని మాట్లాడుకోవడం నేనే స్వయంగా విన్నాను. కానీ నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు, నేను కేవలం ఒక సాధారణ రైతు బిడ్డను. సినిమాపై ఉన్న ఇష్టంతోనే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టానని ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం తెలియజేశారు.