టాప్ చైర్ పై కన్నేసిన కియారా

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ అమ్మడు, సీఎం గర్ల్ ఫ్రెండ్ గా గ్లామర్ గా కనిపిస్తూనే అభినయంతో కూడా ఆకట్టుకుంది. నిజానికి మహేశ్ పక్కన హీరోయిన్స్ పెద్దగా కనిపించరు కానీ భరత్ అనే నేను సినిమా చూస్తే మాత్రం మహేశ్ పక్కన కియారా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అనిపిస్తుంది. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ అవ్వడంతో కియారాకి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.

భరత్ అనే నేను సినిమా విడుదల కాకముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిన కియారా అద్వానీ, వినయ విధేయ రామ మూవీలో తన అందం ప్లస్ యాక్టింగ్ తో మరోసారి మెప్పించడానికి సిద్దమయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ లో కియారా చాలా గ్లామర్ గా కనిపించింది. ముఖ్యంగా ప్రోమో సాంగ్స్ లో అయితే చరణ్ తో పోటీగా డాన్స్ చేస్తున్న కియారా అద్వానీ, టాప్ చైర్ తాను సరైన పోటీ అని హింట్ ఇస్తుంది.

మొదటి సినిమా విడుదల కాకముందే సెకండ్ మూవీ ఛాన్స్ కొట్టేసిన కియారా, ఇప్పుడు కూడా రెండో చిత్రం విడుదల కాకముందే మూడో సినిమా అవకాశం పెట్టేసింది. అది కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో కావడం విశేషం. టాలీవుడ్ లో ఇటీవలే కాలంలో వచ్చిన బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ లో ఒకటైన బన్నీ-త్రివిక్రమ్ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న విషయం అఫీషియల్ గా బయటకి వచ్చేసింది. ఇప్పటికే రెండు మంచి సినిమాలు ఇచ్చిన ఈ కాంబినేషన్ పైన భారీ అంచనాలు ఉన్నాయి, వాటికీ తగ్గట్లు గానే తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించే అవకాశం కొట్టేసిందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే కియారా కెరీర్ లో మరో హిట్ పాడడం ఖాయమనే చెప్పాలి. మూడో సినిమాలకే పెద్ద హీరోల పక్కన నటిస్తున్న కియారా అద్వానీ, త్వరలో మరిన్ని సినిమాలు సైన్ చేసే అవకాశం ఉంది.