Vijay devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న లైగర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ ఈ సినిమాను భారీ
బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. 5 భాషలలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. ఇక దీని తర్వాత కూడా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనలో విజయ్ను హీరోగా ఫిక్స్ చేసుకున్నారట పూరి.
లైగర్ షూటింగ్ పూర్తి చేసిన రోజే జనగణమన చిత్రానికి సంబంధించిన వర్క్‌ను మొదలుపెడుతున్నట్టు పూరీ టీమ్ ప్రకటించింది. ఇక హీరో సహా మిగతా విషయాలను త్వరలో పూరి టీమ్ అధికారికంగా వెల్లడించనుంది. అయితే, ఎప్పుడో విజయ్ దేవరకొండ క్లాస్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ, కరోనా ప్యాండమిక్ వల్ల లైగర్ ప్రాజెక్ట్ డిలే అవడంతో విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు వీరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.
Vijay devarakonda: హిందీలో పలు క్రేజీ మూవీస్ చేతిలో ఉన్నాయి.
ఇక లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారనున్న విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ చేయబోయేది కూడా అదే తరహా పాన్ ఇండియా చిత్రమని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ప్రస్తుతం కియారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, హిందీలో పలు క్రేజీ మూవీస్ చేతిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ – శివ నిర్వాణ ప్రాజెక్ట్ కూడా చేరనుందని తాజా సమాచారం. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.