రూటు మార్చి… రేటు పెంచింది

ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్ గా నిలబడాలి అంటే అందం, అభినయం రెండూ ఉండాలి. ఈ రెండింటినీ బ్యాలన్స్డ్ గా ఉన్నవాళ్లు ఏ ఇండస్ట్రీలో అయినా చాలా త్వరగా కెరీర్ సెట్ చేసుకుంటున్నారు. ఈ కోవలోకే వచ్చే బ్యూటీ కియారా అద్వానీ, ‘ఫగ్లీ’ ‘ధోని’చిత్రాలతోనే తనలోని నటిని బాలీవుడ్ పరిచయం చేసిన ఈ బ్యూటీ, భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

టాలీవడ్ లో డెబ్యూ సినిమాతోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు పక్కన నటించే అవకాశం కొట్టేసిన కియారా, వసుమతి పాత్రలో చాలా హుందాగా కనిపించి మెప్పించింది. మహేశ్ బాబుకి పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యే హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉంటారు, వారిలో కియారా ఒకటని ప్రూవ్ చేసుకుంది. మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ బ్యూటీ, రెండో సినిమానే రామ్ చరణ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసి ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. భరత్ అనే నేను సినిమాలో యాక్టింగ్ తో ఆకట్టుకున్న కియారా, వీవీఆర్ లో మాత్రం తన రూటు మార్చి పూర్తిగా గ్లామర్ షో చేసి, పెర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా హీరోయిన్ లో ఉండాల్సిన ఎలిమెంట్స్ తనలో ఉన్నాయని నిరూపించింది.  అయితే మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కియారా, రెండో సినిమా కూడా సూపర్ హిట్ అయి ఉంటే ఈపాటికి ఈ అమ్మడు టాప్ చైర్ లో కూర్చునేది కానీ ఎవరూ ఊహించని విధంగా వినయ విధేయ రామ ఫ్లాప్ అయ్యింది.

ఈ ఫ్లాప్ విషయం కియారాకి ఎక్కిందో లేదో తెలియదు కానీ తెలుగులో ఈ అమ్మడు మూడో సినిమా కోసం ఒక నిర్మాత, దర్శకుడు సంప్రదిస్తే దాదాపు కోటిన్నర అడిగిందట. టాప్ లో చైర్ లో ఉన్న వాళ్లకి కూడా లేని రెమ్యునరేషన్ ని ఒక హిట్, మరో ఫ్లాప్ ఉన్న హీరోయిన్ కి ఇవ్వాలా అనే డైలమాలో పడ్డారట. ఇలా ఉన్నపళంగా రెమ్యునరేషన్ మార్చిన కియారా అద్వానీ, తన దగ్గరకి వచ్చే వాళ్లకి షాక్ ఇస్తుందట. కేవలం రెమ్యునరేషన్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఒప్పుకుంటే వినయ విధేయ రామలాగా నాలుగు పాటలు, మూడు స్కిన్ షో సీన్స్ మాత్రమే ఉండే సినిమాలే వస్తాయి కానీ వాటి వలన కెరీర్ నిలబడదు. ఇదే కొనసాగితే కియారా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది, ఈ విషయాన్ని వీలైనంత త్వరగా గుర్తించి రేట్, రూటు రెండూ మారిస్తే కెరీర్ బాగుంటుంది.