ఫిలిం ఛాంబర్‌లో నివాళి

సినీ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించారు..మరికొద్ది సేపట్లో ఫిలిం ఛాంబర్ నుండి జూబ్లిహిల్స్ మహాప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగనుంది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న రామకృష్ణ శుక్రవారం కన్నుమూశారు.

రామకృష్ణ మరణ వార్త తెలుసుకున్న యావత్ సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు , అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. 100 సినిమాలకు పైగా డైరెక్ట్ చేసి ఎలాంటి గర్వం లేకుండా అందరితో కలిసి మెలిసి ఉండేవారు అంటూ రామకృష్ణ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు కృష్ణం రాజు, సంగీత దర్శకుడు కోటి, జగపతిబాబు, కైకాల సత్యనారాయణ, చిరంజీవి , మోహన్ బాబు , అనుష్క సహా పలువురు నివాళులర్పించారు.