కోలీవుడ్ స్టార్ హీరో, నడిఘర్ సంఘం నాయకుడు… విశాల్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజామోగబోతోంది. నిజానికి విశాల్, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే విశాల్, వరలక్ష్మీలు మాత్రం తమ మధ్య ఉన్న స్నేహం మాత్రమే వేరే ఏమి లేదని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ఇద్దరూ క్లారిటీ ఇచ్చినా ఆగని ఈ రూమర్స్ అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి.
ఈ గోలంతా ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ విశాల్ ఒకడుగు ముందుకేసి, తన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటోని సోషల్ మీడియాలో పెట్టేశాడు. హైదరాబాద్ కి చెందిన బిజినెస్ ఫ్యామిలీ విజయ్ రెడ్డి- పద్మజల కూతురు అనీషా రెడ్డిని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో నటించిన అనిషా, తెలుగులో చాలా మందికి తెలిసిన అమ్మాయే. విశాల్ తో పెళ్లి విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కన్ఫార్మ్ చేసిన అనిషా, కొత్త లైఫ్ లీడ్ చేయడానికి రెడీగా ఉన్నానని స్పష్టం చేసింది. ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చిన విశాల్ కూడా అనిషాతో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి తను కన్ఫార్మ్ చేసింది, త్వరలో డేట్ చెప్తానని ట్వీట్ చేశాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వారంలోనే విశాల్, అనిషారెడ్డిల ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి ఆగష్టులో జరగబోతోంది.
ఇదిలా ఉంటే నడిగర్ సంఘం, నిర్మాతల మండలి భవనాలు నిర్మించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గతంలో చెప్పిన విశాల్, మరి అప్పటి వరకూ ఆగుతాడో లేక మాట తప్పి పెళ్లి చేసుకుంటాడా అనేది చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!