మోడరన్ సూర్యకాంతం

మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక హీరోయిన్ గా సెట్ అవ్వడానికి చాలా ప్రయత్నాలే చేస్తోంది కానీ ఏదీ సక్సస్ అవ్వట్లేదు. ఇప్పటి వరకూ చేసిన నాలుగు సినిమాలూ ఫ్లాప్ అవ్వడంతో నిహారిక ఈసారి ఎలా అయినా హిట్ అందుకోవాలని చేస్తున్న సినిమా ‘సూర్యకాంతం’. ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. నిహారిక కెరీర్ కి లైఫ్ అండ్ డెత్ సినిమా కావడంతో తన అన్న మెగాహీరో వరుణ్ తేజ్ సూర్యకాంతం సినిమాని నిర్మించి, చెల్లికి అండగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ లో నిహారిక యాక్టింగ్ కానీ, కథనం కానీ తన ఫస్ట్ వెబ్ సిరీస్ ముద్దపప్పు ఆవకాయ్ ని గుర్తు చేశాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఆ వెబ్ సిరీస్ కి ఇది ఎక్స్టెండెడ్ వెర్షన్ లాగా ఉంది. నిహారిక బయట ఎలా ఉంటుందో తెరపై కూడా అలానే కనిపించే ప్రయత్నం చేసినట్లుంది. ఈ సూర్యకాంతం సినిమా అయినా హిట్ అయితే నిహా కెరీర్ సెట్ అవుతుంది లేదంటే మాత్రం కెరీర్ నిలబెట్టుకోవడం కష్టమే.