Aacharya: “ఆచార్య” కి క్లైమాక్స్ అదిరిపోయే ప్లాన్ సెట్ చేసిన కొరటాల -రామ్ చరణ్..??

Share

Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా “ఆచార్య” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాదాపు సంవత్సరన్నరకు  పైగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సైరా సినిమా తర్వాత చిరంజీవి కొద్దిగా గ్యాప్ తీసుకుని వెంటనే “ఆచార్య”  స్టార్ట్ చేయగా .. కరోనా ఎంట్రీ ఇవ్వటంతో అప్పటినుండి ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతూ వస్తోంది. ప్రారంభించిన టైంలో 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న క్రమంలో తర్వాత లాక్ డౌన్ ఏర్పడటంతో పాటు మరో పక్క పరిస్థితులు ఉన్న కొద్ది దిగజారుతూ ఉండటంతో .. షూటింగ్ ఆగిపోవటం తెలిసిందే.

Acharya Teaser: Chiranjeevi, Ram Charan, Kajal Aggarwal starrer's first  glimpse to release on this date | Telugu Movie News - Times of India

అయితే ఆ తరువాత షూటింగ్లకు అనుమతులు రావడంతో, దాదాపు చాలా స్పీడ్ గా “ఆచార్య” షూటింగ్ కంప్లీట్ చేయాలని కొరటాల వేసిన ఎత్తుగడలు చాలావరకు వర్కవుట్ అయాయ్యి.  ప్రస్తుతం క్లైమాక్స్ కి చేరుకుంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా  కొరటాల -రామ్ చరణ్ కలసి ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల లో  లేటెస్ట్ టాక్.

Read More: Vijay Deverakonda: సుకుమార్ తో సినిమా చేయక ముందే మరో ట్విస్ట్ ఇవ్వబోతున్న విజయ్ దేవరకొండ..??

మేటర్ లోకి వెళ్తే సినిమా చివరిలో రామ్ చరణ్ – చిరంజీవి లతో హీరోయిన్లు పూజా హెగ్డే.. కాజల్ అగర్వాల్ రొమాంటిక్ సాంగ్ లో చిందులు వేసే రీతిలో ప్లాన్ చేయడం జరిగినది అని తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ రొమాంటిక్ సాంగ్ చాలా అద్భుతంగా ఇచ్చినట్లు .. చివరిలో ఫీల్ గుడ్ తరహాలో ఆడియన్స్ ని ఆకట్టుకునే రీతిలో ఈ సాంగ్ చేసినట్లు సమాచారం. సాంగ్ లో చిరంజీవి.. చరణ్ స్టెప్పులు హైలైట్ అవుతాయని టాక్.  

 


Share

Related posts

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

bharani jella

పాక్ డ్రోన్ కాల్చివేత

sarath

లంచ్ సమయానికి భారత్ స్కోరు 69/1

Siva Prasad