డైరెక్టర్ కొరటాల శివ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ లేని ట్రాక్ రికార్డు కలిగిన డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో “ఆచార్య” అనే సినిమా చేస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటి వరకు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే.
కమర్షియల్ నేపథ్యంలో మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో కొరటాల సినిమాలు చేస్తూ అదిరిపోయే విజయాలు సాధించాడు. ఇటువంటి తరుణంలో చిరంజీవి “ఆచార్య” సినిమా కూడా సమాజంలో అవినీతిపరులకు వ్యతిరేకంగా కామ్రేడ్ ఏ రీతిలో పోరాడతాడు అన్న రీతిగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో మార్షల్ ఆర్ట్స్ తరహాలో చిరంజీవి పోజు ఉండటంతో సినిమాలో ఆ టైపులో కొరటాల ఫైట్ ప్లాన్ చేసినట్లు…. ఆ ఫైట్ థియేటర్లో చూస్తే ఫాన్స్ కి పూనకాలే అన్నట్లు సమాచారం.
చాలా ప్రత్యేకంగా ఈ ఫైట్ ని కొరటాల డిజైన్ చేసినట్లు వార్తలు అందుతున్నాయి. ఫైట్ చేస్తున్నంతసేపు “గ్యాంగ్ లీడర్” సినిమా లో చిరంజీవి లుక్ ఎలా ఉంటుందో ఆ లుక్ లో ఫైట్ ఉంటుందని కొరటాల అదిరిపోయే ప్లానింగ్ తో ఓ రేంజ్ లో “ఆచార్య” మార్షల్ ఆర్ట్స్ సినిమా ఫైట్ చిత్రీకరించినట్లు టాక్.