న్యూస్ సినిమా

Koratala Siva: ఆచార్యలో కాజల్ లేదు..క్లారిటీగా చెప్పేసిన దర్శకుడు..

Share

Koratala Siva: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫైనల్‌గా ఈ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూజా హెగ్డే చరణ్ సరసన నటించింది. అలాగే, చిరు సరసన కాజల్ నటించింది. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ – కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి నిర్మించారు.

koratala-siva-declares removal of kajal character
koratala-siva-declares removal of kajal character

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవలే నిర్వహించారు. అయితే, ఈ మధ్య కాలంలో ఆచార్యలో నటించిన కాజల్ అగర్వాల్ గురించి చిరు కానీ చరణ్ కానీ దర్శకుడు కొరటాల శివ కానీ మాట్లాడం లేదు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో కూడా ఎవరూ కాజల్ పేరును ప్రస్తావించలేదు. దాంతో అందరిలో చాలా సందేహాలు ఇంకా ఎక్కువయ్యాయి. అసలు కాజల్ సీన్స్ ఉన్నాయా..లేవా అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా దర్శకుడు కొరటాల శివ ఓపెన్ అయ్యారు.

Koratala Siva: అది తెలిసి కూడా ఎందుకు స్పందించలేదు..

ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ పాత్రను తీసేసినట్టు క్లారిటీ ఇచ్చారు. ముందు కాజల్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్టు 4 రోజులు షూటింగ్ కూడా జరిపినట్టు చెప్పారు. అయితే, ఆ తర్వాత కొన్ని సందేహాలు కలిగాయని..ఆచార్య పాత్ర ను ప్రేమించే హీరోయిన్ పాత్ర ఉండటం కరెక్ట్ అనిపించలేదని దాంతో ఇక కాజల్ పాత్ర ఉండటం కరెక్ట్ కాదని వద్దనుకున్నట్టు వెల్లడించారు. అయితే, ఇన్నిరోజుల నుంచి ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికీ అన్నీ సోషల్ మీడియా సైట్స్‌లో..టివీ ఛానల్స్‌లో కాజల్ హీరోయిన్ అని వార్తలు ప్రసారమయ్యాయి. అది తెలిసి కూడా ఎందుకు స్పందించలేదని సూటిగానే అడుగుతున్నారు.


Share

Related posts

రితేష్‌, జెనీలియా దంపతుల దాతృత్వం

Siva Prasad

Dharsha Gupta Gorgerge pics

Gallery Desk

Pakka Commercial: “పక్కా కమర్షియల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజిపైన డైరెక్టర్ మారుతి కి చిరంజీవి బంపర్ ఆఫర్..!!

sekhar