సినిమా

NTR 30: రాజకీయ నేపథ్యంలో `ఎన్టీఆర్ 30`.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కొర‌టాల!

Share

NTR 30: `ఆర్ఆర్ఆర్‌`తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్, క‌ళ్యాణ్ రామ్ క‌లిసి హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

మ‌రి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సినిమా రాజ‌కీయ నేప‌థ్యంలోనే రాబోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యంపై తాజాగా కొర‌టాల ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈయ‌న `ఆచార్య` ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే కొర‌టాల రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేల‌తో క‌లిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంట‌ర్వ్యూలో `ఎన్టీఆర్ 30` ప్ర‌స్తావ‌న రాగా.. కొర‌టాల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే..

`ఎన్టీఆర్ 30 రాజ‌కీయ నేప‌థ్యంలో రాబోతోంద‌న్న ప్ర‌చారంలో ఏ మాత్రం నిజం లేదు. వాస్త‌వానికి ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని ఒక విభిన్నమైన బ్యాక్ డ్రాప్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రాబోతోంది. ప్రతి ఒక్కరికి నచ్చేలా ఈ సినిమా కథ ఉంటుంది` అని కొర‌టాల పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి.


Share

Related posts

Catherine Tresa Amazing Pictures

Gallery Desk

Trivikram : త్రివిక్రమ్ ఆ డైరెక్టర్‌ను తొక్కేస్తున్నాడా..?

GRK

ఈ డైరెక్టర్ గనక మెగాస్టార్ కి హిట్టిచ్చాడంటే ఆ ఇద్దరు స్టార్స్ పిలిచి మరీ అడ్వాన్స్ ఇప్పిస్తారట ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar