NewsOrbit
Entertainment News సినిమా

Devara: రెండు భాగాలుగా రాబోతున్న “దేవర” స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన కొరటాల శివ..!!

Share

Devara: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “దేవర” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. “RRR” వంటి అతిపెద్ద హిట్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావటంతో “దేవర” విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో రాజమౌళి సినిమా చేసిన తర్వాత వరుస పెట్టి పరాజయాలు ఎదురయ్యాయి. సింహాద్రి, యమదొంగ సినిమాలు చేసిన తర్వాత నెక్స్ట్ హిట్ అందుకోవడానికి ఎన్టీఆర్ కింద మీద పడ్డారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా తారక్.. “దేవర” ప్రతి సన్నివేశం విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.

Koratala Siva released the special video of Devara which is coming in two parts

ఆల్రెడీ కొరటాల శివ దర్శకత్వంలో 2016వ సంవత్సరంలో ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో ఇప్పుడు “దేవర” చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో ఏప్రిల్ 5వ తారీఖు సినిమా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా “దేవర” సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ తెలియజేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

Koratala Siva released the special video of Devara which is coming in two parts

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. అదేవిధంగా దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ డబల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో “దేవర” రెండు భాగాలుగా తీస్తున్నట్లు కొరటాల శివ ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మొదటి భాగం ఏప్రిల్ నెలలో విడుదల కానుండగా రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.


Share

Related posts

Intinti Gruhalakshmi: తులసిదే తప్పన్న సామ్రాట్.. రేపటికి సూపర్ ట్విస్ట్ సిద్ధం చేసిన లాస్య..! 

bharani jella

Breaking: రామ్ గోపాల్ వర్మ మొదటి లవర్ ఇదిగో !!

amrutha

Kiara Advani Beautiful Images

Gallery Desk