NewsOrbit
Entertainment News సినిమా

Kota Srinivasa Rao: ఇండస్ట్రీలో కాక రేపుతున్న త్రివిక్రమ్ పై కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు..!!

Share

Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ప్రత్యేక పరిచయం చేయక్కర్లేదు. దాదాపు కొన్ని దశాబ్దాల నుండి తెలుగు చలనచిత్ర రంగంలో అనేకమైన వైవిధ్యమైన పాత్రలు చేసిన నటుడు. ప్రజెంట్ వయసు మీద పడటంతో సినిమా అవకాశాలు అంతగా రావడం లేదు. ఇలా ఉంటే కోట శ్రీనివాసరావు తాజాగా ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… డైరెక్టర్ త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే తెలుగు చలనచిత్ర రంగంలో దర్శకులు గురించి మాట్లాడుతూ… ఒకప్పుడు దర్శకుల ప్రతిభా ఎంతో అద్భుతంగా ఉండేది. వారిలో ఉన్నటువంటి ఈ ప్రతిభ చూసి నటులకు ఎంతో ఆశ్చర్యం కలిగేది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో అలాంటి ప్రతిభ నాకు ఎవరి దగ్గర కనిపించలేదు.

Kota Srinivasa Rao comments on Trivikram who is not in the industry

ఒక్క రాజమౌళికి మాత్రం… దర్శకుడికి ఉండాల్సిన గొప్ప లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి. ఆయన తీసిన సినిమాలు చూస్తున్నంత సేపు అదే ఫీలింగ్ కూడా కలుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి మాత్రం కోట శ్రీనివాసరావు వెరైటీగా స్పందించారు. ఇండస్ట్రీలో చాలామంది త్రివిక్రమ్ గొప్ప దర్శకుడు అని చెబుతుంటారు. నాకైతే ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్ అనిపించదు. ఆయన రాసే డైలాగులు మాటలలో తప్పిస్తే డైరెక్షన్ పరంగా పెద్దగా ప్రతిభ ఉండదు అన్న తరహాలో ఇన్ డైరెక్ట్ గా కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు. దీంతో త్రివిక్రమ్ పై కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి. గతంలో ఇదేవిధంగా కోటా శ్రీనివాసరావు పలువురు దర్శకులు మరియు హీరోయిన్స్ అదేవిధంగా హీరోలపై కామెంట్లు చేయడం జరిగింది.

Kota Srinivasa Rao comments on Trivikram who is not in the industry

ఇప్పుడు ఏకంగా త్రివిక్రంపై ఆయన వ్యాఖ్యలు చేయటం ఇండస్ట్రీలో చర్చినియాంశంగా మారింది. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో కోటా శ్రీనివాసరావు పలు సినిమాలలో కూడా నటించారు. మహేష్ చేసిన అతడు, మల్లీశ్వరి, స్వయంవరం, జులాయి, అత్తారింటికి దారేది.. సినిమాలు చేయడం జరిగింది. అటువంటి అవకాశాలు ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ పై కోట శ్రీనివాసరావు ఈ రకంగా కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది.


Share

Related posts

Nayan-Vignesh: న‌య‌న్‌-విఘ్నేశ్‌లు హనీమూన్ కోసం ఎక్క‌డికి చెక్కేశారో తెలుసా?

kavya N

OTT Releases This Weekend: OTTలో రంగబలి, హత్య, భాగ్ సాలె, పరేషాన్, ఇంకా ఈ సినిమాలు…ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదే లేదు!

sekhar

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ హరీష్ శంకర్..??

sekhar