krithi shetty: `ఉప్పెన` వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. ఇటీవల న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన `శ్యామ్ సింగరాయ్` చిత్రంతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా కృతీ నటించిన `బంగార్రాజు` సినిమా సైతం బ్లాక్ బస్టర్‌గానే నిలిచింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాడు.
సొగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ జనవరి 14న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సంక్రాంతి విడుదలైన చిత్రాల్లో మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్న బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది.

ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మేకర్స్ బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్‌ను రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న కృతి శెట్టి నాగార్జున, నాగచైతన్యలపై ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ..`బంగార్రాజు పేరు వినగానే నాగార్జున, చైతూలే గుర్తుకు వస్తారు.
రియల్ లైఫ్ లోనూ వాళ్లిద్దరూ బంగారాలే. నాగ్ సార్ ను చూడగానే చాలా రాయల్ గా కనిపిస్తారు. ఇక చైతూ చాలా స్వీట్ హార్ట్ .. ఆయనతో కలిసి నటించే అవకాశం లభించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది` అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి నాగ్, చైతులను బంగారంతో పోల్చడంతో అక్కినేని అభిమానులు తెగ మురిసిపోతున్నారు.