Krithi Shetty: కృతి శెట్టి.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 2020లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ `ఉప్పెన`లో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన కృతి శెట్టి.. తొలి చిత్రంతోనే కావాల్సినంత క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకుని ఇటు యంగ్ హీరోలకు, అటు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్‌గా మారింది.
ప్రస్తుతం తెలుగులో సుధీర్ బాబుకు జోడీగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్ సరసన `మాచర్ల నియోజవర్గం` చిత్రాలు చేస్తోంది. రామ్ పోతినేనితో `ది వారియర్` అనే బైలింగ్యువల్ మూవీలో నటిస్తోంది. అలాగే స్టార్ హీరో సూర్యతో బాలా దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సైన్ చేసింది. కృతి కోలీవుడ్‌లో డైరెక్ట్‌గా చేస్తున్న తొలి చిత్రమిది.
అయితే తాజాగా కోలీవుడ్ నుంచి మరో బంపర్ ఆఫర్ కృతి శెట్టిని వరించినట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. ప్రముఖ స్టార్ హీరో ధనుష్ అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. అయితే ఈ చిత్రంలో ధనుష్‌తో కృతి శెట్టి జతకట్టబోతోందట.
కృతి కంటే ముందు ప్రియాంకా అరుళ్ మోహన్‌ను సెలెక్ట్ చేయగా.. క్యాల్షీట్ సమస్య కారణంగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుందట. దాంతో ఆమె స్థానంలో కృతి శెట్టిని ఎంపిక చేశారని, ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయని అంటున్నారు. దీంతో లక్కంటే కృతి శెట్టిదే అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…