Krithi Shetty: ప్రస్తుతం టాలీవుడ్‌ను దడదడలాడిస్తున్న యంగ్ బ్యూటీల్లో కృతి శెట్టి ఒకరు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించిన ఈ అందాల భామ.. 18 ఏళ్లకే `ఉప్పెన` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. 2021లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తొలి సినిమాతోనే యూత్‌లో సూపర్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న కృతి శెట్టి.. ఆ వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది. ఇంకేముందు.. అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరోలు, స్టార్ హీరోలు కృతి శెట్టి కోసం పోటీ పడుతున్నారు.
ఈమె ఇప్పుడు సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్‌కు జోడీగా `ది వారియర్`, నితిన్ సరసన `మాచర్ల నియోజవర్గం` చిత్రాలు చేస్తోంది. అలాగే సూర్య 41వ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక అయింది. కోలీవుడ్‌లో ఇదే కృతి శెట్టికి తొలి చిత్రం. అయితే ఈ మూవీ కంటే ముందే ద్విభాషా చిత్రమైన `ది వారియర్`తో తమిళ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాట కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ప్రాంక్ స్టర్లు ఆశిక్, సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు.
అయితే ఇంటర్వ్యూ మధ్యలో యాంకర్లిద్దరూ ముందు నేను ప్రశ్నలు అడుగుతానంటే, నేను అడుగుతానని ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కొట్లాకు దిగారు. దాంతో ఏం జరుగుతుందో తెలియక కృతి భయపడిపోయింది. ఆ తర్వాత వారు ప్రాంక్ అనడంతో ఊపిరి పీల్చుకున్న కృతి.. మొదట నవ్వినా ఆపై దుఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. దాంతో ఆమెకు సర్థిచెప్పి .. ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు. అందుకు కృతి ఎవరైనా కఠినంగా మాట్లాడితే తనకు అస్సలు నచ్చదని, భయం వేస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి కృతి ఏడుస్తున్న వీడియో మాత్రం వైరల్‌గా మారింది.
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, అందాల భామ రాశి ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పక్కా…