Krithi Shetty: సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు తెరపై పరిచయమైన భామ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకోవడమే కాదు.. అందులో బేబమ్మగా ప్రేక్షకుల మనసు దోచేసింది.
ఉప్పెన తర్వాత ఈమె నానితో చేసిన `శ్యామ్ సింగరాయ్`, నాగ చైతన్య సరసన నటించిన `బంగార్రాజు` చిత్రాలు కూడా మంచి విజయం సాధించడంతో.. కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న లక్కీ హీరోయిన్గా కృతి రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం బేబమ్మ సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ సరసణ `ది వారియర్`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం` చిత్రాల్లో నటిస్తోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలు మరి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే కృతి శెట్టి త్వరలోనే కోలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరో సూర్య తరుపరి ప్రాజెక్ట్‌లో ఈమెను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది.
మొత్తానికి కెరీర్ పరంగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్‌ను పెంచుకోవడం కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫొటో షూట్లతో అల్లాడిస్తోంది. తాజాగా కూడా చిలక పచ్చ చీర, స్లీవ్ లెస్ ధరించి.. మైండ్‌బ్లాక్ అయ్యేలా ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాగా.. వాటిని చూసి నెటిజన్లు బేబమ్మ ఎంత అందంగా ఉందో, ముద్దొచ్చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.