సినిమా

Krithi Shetty: అలాంటి పాత్ర చేయాల‌నుంది..కోరిక బ‌య‌ట‌పెట్టిన‌ కృతి శెట్టి!

Share

Krithi Shetty: కృతి శెట్టి.. ఈమె గురించి కొత్త‌గా ఏమీ చెప్ప‌క్క‌ర్లేదు. ఇర‌వై ఏళ్లు రాక‌ముందే టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ డ‌బ్యూ చిత్ర‌మైన `ఉప్పెన‌`తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత ఆమె న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాలు కూడా మంచి విజ‌యం సాధించాయి.

దీంతో కెరీర్ స్టార్టింగ్‌లోనే హ్యాట్రిక్ హిట్స్‌ను అందుకున్న హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. తాజాగా కృతి శెట్టి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న మ‌న‌సులో ఉన్న ఓ కోరిక బ‌య‌ట‌పెట్టింది. అస‌లింత‌కీ ఆమె ఏం చెప్పిందంటే.. `నేను ఇప్పటిదాకా చేసిన పాత్ర‌ల‌న్నీ వేటికవి భిన్నమైనవి.

Krithi Shetty Uppena Movie Events Half Saree Pictures

అందుకే ప్రేక్షకులకు నేను ప్రతిసారీ కొత్తగా కనిపించారు. నా దగ్గరకొచ్చే కథల్లో గత చిత్రాలను పోలినవి, మూసగా అనిపించినవి చేయ‌డానికి అస్స‌ల ఒప్పుకోను. నటిగా సవాలు విసిరే సినిమాల్లో నటించాలని ఉంది. అలాగే రాకుమారి పాత్రలో నటించాలన్నది నా కోరిక. అది ఎప్పటికి తీరుతుందో చూడాలి. ఇక త్వరలో సొంత డబ్బింగ్‌ చెప్పుకోవాలనీ ప్రయత్నిస్తున్నా` అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

మ‌రి రాకుమారి పాత్ర‌ను చేయాల‌నే కృతి శెట్టి కోరిక‌ను ఏ ద‌ర్శ‌కుడు నెర‌వేరుస్తాడో చూడాలి. కాగా, ప్ర‌స్తుతం ఈ బ్యూటీ.. త‌మిళ డైరెక్ట‌ర్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఎన‌ర్జిటిక్ రామ్ పోతినేనికి జోడీగా `ది వారియ‌ర్‌` అనే ద్విభాషా చిత్రం చేస్తోంది. అలాగే సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్‌తో `మాచర్ల నియోజవర్గం` అనే చిత్రాల్లోనూ కృతి న‌టిస్తోంది,

 


Share

Related posts

సీక్వెల్‌కు ప్రేర‌ణ అక్క‌డి నుండే

Siva Prasad

బ్రేకింగ్: ఆ డైరెక్టర్ తో సినిమాను ప్రకటించిన చిరంజీవి.. వద్దు మొర్రో అంటున్న అభిమానులు

Vihari

NTR : తమిళ్ టాప్ డైరెక్టర్ తో సలార్ కి ధీటుగా సినిమా ఓకే చేసిన జూనియర్ ఎన్‌టి‌ఆర్… !

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar